ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. పండుగల్లో అతి పెద్దదైన సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లేందుకు లక్షలాది మంది ప్రయాణికులు బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బస్సుల్లో పండగ రద్దీ కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభిస్తున్న ఏపీలో మాత్రం వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉంటూ వచ్చింది. కానీ గత నాలుగు […]

Advertisement
Update:2022-01-10 02:53 IST

సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. పండుగల్లో అతి పెద్దదైన సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లేందుకు లక్షలాది మంది ప్రయాణికులు బస్సుల్లో రిజర్వేషన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే బస్సుల్లో పండగ రద్దీ కనిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభిస్తున్న ఏపీలో మాత్రం వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉంటూ వచ్చింది.

కానీ గత నాలుగు రోజుల నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో విపరీతంగా పెరిగింది. దీంతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా అన్ని జిల్లాల్లో నమోదవుతున్నాయి. ఏపీలో కంటే పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది.

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో స్థిరపడ్డ వారు పెద్ద సంఖ్యలో సొంతూర్లకు వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణిస్తే వైరస్ వ్యాప్తి మరింత అధికమయ్యే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం బస్సుల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది.

బస్సులో ప్రయాణికులు మాస్కు ధరించకపోతే 50 రూపాయలు జరిమానా విధిస్తామని తెలిపింది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రయాణికులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ప్రభుత్వం సూచించింది.

Tags:    
Advertisement

Similar News