సంక్రాంతికి రవితేజ సినిమా లాంఛ్

రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో రీసెంట్ గా కొత్త సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి రావణాసుర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడీ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి పండక్కి జ‌న‌వ‌రి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. రావణాసుర చిత్రానికి శ్రీకాంత్ విస్సా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ అందించారు. స్టైలిష్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రంలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించ‌నున్నారు. అభిషేక్ పిక్చర్స్, […]

Advertisement
Update:2022-01-03 13:26 IST

రవితేజ, సుధీర్ వర్మ కాంబోలో రీసెంట్ గా కొత్త సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి రావణాసుర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడీ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా సంక్రాంతి పండక్కి జ‌న‌వ‌రి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. రావణాసుర చిత్రానికి శ్రీకాంత్ విస్సా ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ అందించారు. స్టైలిష్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రంలో రవితేజను మునుపెన్నడూ చూడని పాత్రలో చూపించ‌నున్నారు.

అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌ వర్క్స్ (రవితేజ బ్యానర్) సంస్థలు కలిసి ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. రావణాసురలో ర‌వితేజ లాయ‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. దీపా‌వళికి రిలీజైన ఈ భారీ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. రావణాసురలో క‌థానాయ‌కుడు ప‌ది డిఫ‌రెంట్ గెట‌ప్స్ లో క‌నిపిస్తుండ‌డం విశేషం.

రావణాసుర సినిమాలో రవితేజ విలక్షణమైన పాత్రలో కనిపిస్తాడని పోస్టర్‌లోనే తెలిసిపోతోంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో రూపొందే ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఉండబోతోంది. ఇప్పటివరకు ఖిలాడీ మూవీనే రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ సినిమా. ఇప్పుడా రికార్డును రావణాసుర సినిమా అధిగమించబోతోంది. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిలవబోతోంది.

Tags:    
Advertisement

Similar News