సిద్ధూ ఆశలపై నీళ్లు.. పంజాబ్ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం..

అమరీందర్ సింగ్ ఉన్నన్ని రోజులు.. ఆయనే పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండేవారు. ఆయన పార్టీని వీడిన తర్వాత జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తామని చెప్పింది. అమరీందర్ కి పొగపెట్టి బయటకు పంపించిన సిద్ధూ.. ఆయన తర్వాత సీఎం కుర్చీ అధిష్టించాలని ఉబలాటపడ్డారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ దళితమంత్రం పఠించి చరణ్ జీత్ సింగ్ చన్నీకి అవకాశమిచ్చింది. దీంతో సిద్ధూ సైలెంట్ […]

Advertisement
Update:2021-12-29 03:07 IST

అమరీందర్ సింగ్ ఉన్నన్ని రోజులు.. ఆయనే పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండేవారు. ఆయన పార్టీని వీడిన తర్వాత జరగబోతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్తామని చెప్పింది. అమరీందర్ కి పొగపెట్టి బయటకు పంపించిన సిద్ధూ.. ఆయన తర్వాత సీఎం కుర్చీ అధిష్టించాలని ఉబలాటపడ్డారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ దళితమంత్రం పఠించి చరణ్ జీత్ సింగ్ చన్నీకి అవకాశమిచ్చింది. దీంతో సిద్ధూ సైలెంట్ అయ్యారు. అయితే వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తానే సీఎం అంటూ ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.

మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అది చేస్తా, ఇది చేస్తానంటూ ఇప్పటికే రాజకీయ సభల్లో సిద్ధూ హామీలు ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల వ్యవహారాల్లో కలుగజేసుకోవడం, తనని తాను పెద్ద నాయకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడం సిద్ధూకి బాగా ఇష్టం. ఈ క్రమంలో చరణ్ జీత్ సింగ్ చన్నీని కేవలం డమ్మీ ముఖ్యమంత్రిగా మార్చేందుకు కూడా సిద్ధూ ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక అధికారుల బదిలీలన్నీ తన కనుసన్నల్లోనే జరుపుతున్నారు. దీంతో కాంగ్రెస్ సిద్ధూ దూకుడికి ముకుతాడు వేయాలని భావించింది. సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే వచ్చే ఎన్నికలను ఎదుర్కుంటామని తేల్చి చెప్పింది. అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను స‌మష్టి నాయ‌క‌త్వంతో ఎదుర్కోవాల‌ని కాంగ్రెస్ హైక‌మాండ్ పంజాబ్ పార్టీ రాష్ట్ర శాఖ‌కు స్ప‌ష్టం చేసింది.

సిద్ధూని జాట్ నేత‌గా, సీఎం చ‌ర‌ణ్‌ జీత్ సింగ్ చ‌న్నీ ద‌ళిత నేత‌గా, సునీల్ జాఖ‌డ్ హిందూ నేత‌గా ఆయా వ‌ర్గాల‌ ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోగ‌ల‌ర‌ని పార్టీ నాయ‌క‌త్వం భావిస్తోంంది. ఈ క్రమంలో ముగ్గురి మధ్య సయోధ్య ఉండాలని, ఏ వర్గం ఓట్లు కూడా తమకు దూరం కాకూడదని భావిస్తోంది కాంగ్రెస్. కానీ ఇప్పటికే హస్తం పార్టీకి పంజాబ్ లో చాలా నష్టం జరిగింది. అమరీందర్ సింగ్ సొంత కుంపటి పెట్టుకోవడం, సీనియర్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరే పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ కి కష్టాలు మొదలయ్యాయి. ఈ దశలో సీఎం అభ్యర్థిని ప్రకటించి మరో తప్పు చేయకూడదని భావించిన అధిష్టానం.. సిద్ధూకి రుచించదని తెలిసినా తాజా ప్రకటన చేసింది.

అభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టిస్తున్న సిద్ధూ
మరోవైపు సిద్ధూ మాత్రం ప‌లు స‌భ‌ల్లో తన‌ను కాంగ్రెస్ సీఎం అభ్య‌ర్ధిగా ప‌రోక్షంగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో అభ్య‌ర్ధుల పేర్ల‌ను తానే స్వ‌యంగా ప్ర‌క‌టిస్తున్నారు. సిద్ధూయే టికెట్లు కేటాయిస్తుంటే ఇక ఎన్నిక‌ల క‌మిటీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు.

Tags:    
Advertisement

Similar News