రేపే రాధేశ్యామ్ ట్రయిలర్ రిలీజ్

రాధేశ్యామ్ ట్రయిలర్ పై క్లారిటీ వచ్చేసింది. రేపు ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. ఇదేదో ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ కాదు, ప్రీ-రిలీజ్ ఫంక్షన్. రాధేశ్యామ్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను రేపు సెలబ్రేట్ చేయబోతున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు అభిమానుల సమక్షంలో రాధేశ్యామ్ సినిమా ట్రయిలర్ లాంఛ్ కాబోతోంది. ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిథుల్ని ఆహ్వానించలేదు. ప్రభాస్ ఒక్కడే మెయిన్ ఎట్రాక్షన్ గా ఉండబోతున్నాడు. […]

Advertisement
Update:2021-12-22 15:19 IST

రాధేశ్యామ్ ట్రయిలర్ పై క్లారిటీ వచ్చేసింది. రేపు ఈ సినిమా ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. ఇదేదో ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ కాదు, ప్రీ-రిలీజ్ ఫంక్షన్. రాధేశ్యామ్ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను రేపు సెలబ్రేట్ చేయబోతున్నారు. రామోజీ ఫిలింసిటీలో ఈ వేడుక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు అభిమానుల సమక్షంలో రాధేశ్యామ్ సినిమా ట్రయిలర్ లాంఛ్ కాబోతోంది.

ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిథుల్ని ఆహ్వానించలేదు. ప్రభాస్ ఒక్కడే మెయిన్ ఎట్రాక్షన్ గా ఉండబోతున్నాడు. అభిమానులతో కలిసి ప్రభాస్ తన సినిమా ట్రయిలర్ లాంఛ్ చేస్తాడు. ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు.. 24 గంటల ముందే, అంటే ఈరోజే ట్రయిలర్ ను లాక్ చేసి పెట్టారు. అంతా రెడీ అన్నమాట

సంక్రాంతి కానుకగా జనవరి 14న రాధేశ్యామ్ థియేటర్లలోకి వస్తోంది. పూజాహెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకాబోతోంది రాధేశ్యామ్ సినిమా.

Tags:    
Advertisement

Similar News