అబ్బాయిల వివాహ వయసు 18 ఏళ్లకు తగ్గించండి.. ఒవైసీ వింత డిమాండ్..

అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ప్రేమ పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని, చిన్న వయసులో గర్భధారణతో అమ్మాయిలు పడే అవస్థలకు కాలం చెల్లుతుందని భావించారు. కానీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వంటివారు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం మహిళల ఓట్లు కోసమే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని […]

Advertisement
Update:2021-12-19 04:07 IST

అమ్మాయిల పెళ్లి వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అన్ని వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ప్రేమ పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని, చిన్న వయసులో గర్భధారణతో అమ్మాయిలు పడే అవస్థలకు కాలం చెల్లుతుందని భావించారు. కానీ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వంటివారు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం మహిళల ఓట్లు కోసమే ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని మండిడ్డారాయన. నిజంగా మహిళలపై ప్రధానికి ప్రేమ ఉంటే వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుని మెరుగు పరిచేందుకు అవకాశాలు కల్పించాలని, ఉపాధి, ఉద్యోగాల కల్పనకు కృషి చేయాలన్నారు ఒవైసీ.

అన్నీ చేయొచ్చు కానీ పెళ్లి చేసుకో కూడదా..?
18 ఏళ్ల వయసున్న వారు ఒప్పందాలపై సంతకాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, ఎన్నికల్లో తమకు నచ్చినవారికి ఓటు వేయచ్చు, ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు కానీ పెళ్ళి మాత్రం చేసుకోకూడదా ? అని ప్రశ్నించారు ఒవైసీ. శారీరక సంబంధాలు కలిగి ఉండేందుకు, సహజీవనంపై నిర్ణయం తీసుకునే విషయంలో వారికి స్వేచ్ఛ ఉంది కానీ, జీవిత భాగస్వామిని ఎంచుకో కూడదా ? అంటూ ఒవైసీ మండిపడ్జారు. ఈ నిర్ణయాన్ని ఎన్నికల స్టంట్ గా కొట్టిపారేశారు.

అబ్బాయిలకు తగ్గించండి..
అమ్మాయిల వివాహ వయసు పెంచే బదులు అబ్బాయిల వివాహ వయసు 21 సంవత్సరాల నుంచి.. 18 ఏళ్లకు తగ్గించాలని సూచించారు ఒవైసీ. మోదీ ప్రభుత్వ పితృస్వామ్య విధానాలకు ఈ నిర్ణయమే నిదర్శనమని పేర్కొన్నారు. దేశంలో ప్రతి నలుగురు అమ్మాయిలలో ఒకరికి 18 ఏళ్ల లోపే పెళ్లి చేస్తున్నారని… అలాంటి వివాహాలపై కేవలం 785 క్రిమినల్ కేసులు మాత్రమే నమోదయ్యాయని గుర్తుచేశారు. మహిళల భద్రతను, వారి క్షేమాన్ని ఆలోచించేవారయితే ముందు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News