జనవరిలోగా ఏపీలో అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్..

ప్రస్తుతం ఏపీలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 95శాతానికి చేరుకుంది. నెల్లూరు జిల్లా 100 శాతం ఫస్ట్ డోస్ పంపిణీ పూర్తి చేసి మొదటి స్థానంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా 90 శాతానికి చేరువలో ఉంది. మిగతా జిల్లాల్లో ఫస్ట్ డోస్ పంపిణీ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో సెకండ్ డోస్ పై ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ని త్వరగా […]

Advertisement
Update:2021-12-14 05:46 IST

ప్రస్తుతం ఏపీలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 95శాతానికి చేరుకుంది. నెల్లూరు జిల్లా 100 శాతం ఫస్ట్ డోస్ పంపిణీ పూర్తి చేసి మొదటి స్థానంలో ఉంది. శ్రీకాకుళం జిల్లా 90 శాతానికి చేరువలో ఉంది. మిగతా జిల్లాల్లో ఫస్ట్ డోస్ పంపిణీ దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో సెకండ్ డోస్ పై ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జనవరి చివరినాటికి ఏపీలో అర్హులందరికీ రెండు డోసుల టీకా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.

జనవరికి సాధ్యమయ్యేనా..?
తొలి దశ టీకాని వందశాతం చేరుకోడానికి ఈ నెలాఖరు వరకు సమయం పడుతుంది. ఏపీలోనే కాదు.. దాదాపుగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫస్ట్ డోస్ వేసుకున్నవారు రెండో డోసుకి పెద్దగా ఆసక్తి చూపించడంలేదనే వార్తలొస్తున్నాయి. మొదటి డోస్ ఇవ్వడంపై శ్రద్ధ పెట్టిన అధికారులు, వారందరికీ రెండోడోసు నిర్బంధం చేయడం విషయంలో ఆ స్థాయిలో కృషిచేయలేదు. దీంతో రెండో డోసు పంపిణీ ఆలస్యం అవుతోంది.

ఏపీలో ఇప్పటి వరకూ 6.5కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి. ఫస్ట్ డోస్ 3.8కోట్లు కాగా.. రెండో డోసు 2.7 కోట్లు పంపిణీ అయ్యాయి. అంటే రెండిటి మధ్య దాదాపుగా కోటి డోసుల తేడా ఉంది. ప్రభుత్వం చెప్పిన టార్గెట్ ప్రకారం జనవరిలోగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కావడం కాస్త కష్టమైన పనే. అయితే అదే సమయంలో గతంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ లు నిర్వహించినట్టు స్పెషల్ డ్రైవ్ లు పెడితే మాత్రం టార్గెట్ పూర్తి చేయొచ్చు.

ఏపీలో జీనోమ్‌ సీక్వెన్స్‌ ల్యాబ్‌..
ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ ని కచ్చితంగా నిర్ధారించేందుకు మరో వారం రోజుల్లో జీనోమ్‌ సీక్వెన్స్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు అధికారులు. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా 37వ సారి రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొవిడ్‌ బాధితుల్లో రికవరీ రేటు 99.21%గా ఉందని సమీక్షలో తెలిపారు. వ్యాక్సిన్షన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News