కోటి విరాళం ప్రకటించిన ప్రభాస్
సాయం చేయడంలో ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటాడు. గతంలో ఎన్నోసార్లు సాయం చేసాడు. తాజాగా మరోసారి అదే చేశాడు. ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు మంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు. వాళ్లను ఆదుకోడానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నారు. తాజాగా ప్రభాస్ […]
సాయం చేయడంలో ప్రభాస్ చేయి ఎప్పుడూ పెద్దగానే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా తాను ఉన్నానంటూ ముందుకొస్తుంటాడు. గతంలో ఎన్నోసార్లు సాయం చేసాడు. తాజాగా మరోసారి అదే చేశాడు. ఆంధ్రప్రదేశ్‌ను ఈ మధ్య కాలంలో అనుకోని వర్షాలు, వరదలు మంచెత్తిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా కోట్లాది రూపాయలు నష్టపోయారు ప్రజలు.
వాళ్లను ఆదుకోడానికి తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది హీరోలు, నిర్మాతలు సిఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందిస్తున్నారు. తాజాగా ప్రభాస్ కూడా విరాళం ప్రకటించాడు. ఏకంగా కోటి రూపాయలు విరాళం అందించాడు. గతంలో హైదరాబాద్ వరదల సమయంలో కూడా కోటి రూపాయలు అందించాడు ప్రభాస్. ఇక కరోనా సమయంలో ఏకంగా 4.5 కోట్ల విరాళం అందించాడు.
ఇలా అవసరం అనుకున్న ప్రతీసారి ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి కోటి రూపాయలు విరాళం ఇచ్చాడు రెబల్ స్టార్. ఏపీ వరదలపై స్పందిస్తూ.. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్, చిరంజీవి లాంటి చాలామంది సెలబ్రిటీలు చెరో పాతిక లక్షలు విరాళం అందించారు. ప్రభాస్ ఒక్కడే కోటి రూపాయలు ప్రకటించాడు.