వింటేజ్ "హోమ్" ఇలా రెడీ!
ఇంటిని మోడ్రన్ గా డిజైన్ చేయడం అందరూ చేసేదే. అందుకే ఇప్పుడు చాలామంది డిఫరెంట్ గా ఇంటికి వింటేజ్ టచ్ ఇస్తున్నారు. పాతకాలం నాటి వస్తువులు, వింటేజ్ క్రాఫ్ట్స్ తో ఇంటిని వింటేజ్ హోమ్ గా మార్చొచ్చు. ఇంటిని వింటేజ్ లుక్ తేవాలంటే వింటేజ్ వస్తువులు కొన్ని కావాలి. అయితే పాత వస్తువులు వేరు, వింటేజ్ వస్తువులు వేరు. ఇంటికి వింటేజ్ లుక్ తీసుకురావాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని వింటేజ్ స్టైల్ లో అలంకరించడం […]
ఇంటిని మోడ్రన్ గా డిజైన్ చేయడం అందరూ చేసేదే. అందుకే ఇప్పుడు చాలామంది డిఫరెంట్ గా ఇంటికి వింటేజ్ టచ్ ఇస్తున్నారు. పాతకాలం నాటి వస్తువులు, వింటేజ్ క్రాఫ్ట్స్ తో ఇంటిని వింటేజ్ హోమ్ గా మార్చొచ్చు.
ఇంటిని వింటేజ్ లుక్ తేవాలంటే వింటేజ్ వస్తువులు కొన్ని కావాలి. అయితే పాత వస్తువులు వేరు, వింటేజ్ వస్తువులు వేరు. ఇంటికి వింటేజ్ లుక్ తీసుకురావాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిని వింటేజ్ స్టైల్ లో అలంకరించడం కోసం ఏం చేయాలంటే..
వింటేజ్ లుక్ కోరుకునే వారు.. అప్పటి కాలానికి సంబంధించిన మ్యూజిక్ పోస్టర్లు, సినిమా పోస్టర్లు, బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు, వింటేజ్ కార్లు-బైక్‌ల వాల్ పోస్టర్లు లాంటివి అంటించుకోవచ్చు. అప్పట్లో రాగి, ఇత్తడి వస్తువుల్ని వంట పాత్రలుగానే కాక ఇంటి అలంకరణ కోసం కూడా వాడేవారు. అందుకే రాగి లేదా ఇత్తడి గంగాళంలో నీళ్లు నింపి, అందులో పూలు పెట్టి గుమ్మానికి ఎదురుగా అమర్చచ్చు. రాగి, ఇత్తడి గ్లాసులు, జార్‌లను ఫ్లవర్ వేజ్‌లుగా ఉపయోగించినా వింటేజ్ లుక్ వస్తుంది. గ్రామఫోన్, టెలిఫోన్ వంటి పాత కాలపు వస్తువులు ఉంటే వాటిని హాల్‌లోని టేబుల్‌పై ప్రత్యేకంగా అమర్చాలి. ఆటోమేటిక్ గా ఇల్లు వింటేజ్ లుక్ లో కళకళలాడిపోతుంది.
ఇంటికి వింటేజ్ లుక్ రావాలంటే ఇంట్లో వాడే ఫ్యాబ్రిక్స్ విషయంలోనూ మార్పులు చేయాలి. రెగ్యులర్ ఫ్యాబ్రిక్ కాకుండా చేనేత బట్టలు, కాటన్-లినెన్, జ్యూట్.. వంటి మెటీరియల్స్‌తో రూపొందించిన కర్టెన్లు, బెడ్‌షీట్స్, సోఫా కవర్లు, దిండు కవర్లు, రగ్గులు వంటివి వాడాలి. ఇకపోతే ఇంట్లో కనిపించే రంగుల విషయంలో కూడా వింటేజ్ ప్యాటర్న్ నే వాడాలి. బ్రౌన్, పీచ్, మెరూన్ లాంటి రంగులు వింటేజ్ లుక్ లో ఉంటాయి. చెక్క అల్మరాలు, కుర్చీలు, టేబుల్స్, టిపాయ్.. వంటివన్నీ పాతబడిపోయాయంటూ మూలకు పడేస్తుంటారు చాలామంది. అయితే వీటిని సరిగ్గా అలంకరించుకుంటే ఇంటికి వింటేజ్ లుక్ వస్తుంది. విండ్‌ఛైమ్స్, షాండ్లియర్, గోడ గడియారాలు.. వంటి డెకరేటివ్ ఐటమ్స్‌లో కూడా వింటేజ్ థీమ్‌లో బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకొని అలంకరించుకుంటే సరి మంచి వింటేజ్ లుక్ వస్తుంది.