ఆకర్షణీయ సెల్ఫీ వివాదంపై శశిథరూర్ వివరణ..

లోక్ సభలో మహిళా ఎంపీలతో ఫొటో దిగి.. దానికి ఓ ట్యాగ్ లైన్ జతచేసి సోషల్ మీడియాలో పెట్టిన కాంగ్రెస్ MP Shashi Tharoor ఎట్టకేలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఫొటో దిగడం వరకు పర్వాలేదు, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంలో తప్పేం లేదు, కానీ శశిధరూర్ చేసిన కామెంట్ మాత్రం చాలామందికి నచ్చలేదు. ’పనిచేయడానికి లోక్ సభ ఆకర్షణీయ స్థలం కాదని ఎవరన్నారు’? అంటూ శశిధరూర్ ఆ ఫొటోకి ట్యాగ్ లైన్ పెట్టారు. దీంతో మహిళలను […]

Advertisement
Update:2021-11-30 03:07 IST

లోక్ సభలో మహిళా ఎంపీలతో ఫొటో దిగి.. దానికి ఓ ట్యాగ్ లైన్ జతచేసి సోషల్ మీడియాలో పెట్టిన కాంగ్రెస్ MP Shashi Tharoor ఎట్టకేలకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఫొటో దిగడం వరకు పర్వాలేదు, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంలో తప్పేం లేదు, కానీ శశిధరూర్ చేసిన కామెంట్ మాత్రం చాలామందికి నచ్చలేదు. ’పనిచేయడానికి లోక్ సభ ఆకర్షణీయ స్థలం కాదని ఎవరన్నారు’? అంటూ శశిధరూర్ ఆ ఫొటోకి ట్యాగ్ లైన్ పెట్టారు. దీంతో మహిళలను అందమైన, ఆకర్షణీయమైన వస్తువులుగా చూస్తున్నారంటూ నెటిజన్లు ఆయన్ను ఓ ఆటాడేసుకున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

అయితే శశిధరూర్ క్షమాపణ చెప్పేలోపే ఆ ఫొటోలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి ఓ వివరణ ఇచ్చారు. ఆ పొటో తాను తీశానని, మహిళా ఎంపీలంతా కలసి శశిధరూర్ ని ఫొటో దిగాలని కోరామని చెప్పారు మిమి. దీంతో మిమి చక్రవర్తిపై కూడా ట్రోలింగ్ మొదలైంది.

శశిధరూర్ క్షమాపణ..
కేవలం నెటిజన్లే కాదు, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ కూడా ఈ ఫొటో కామెంట్ పై మండిపడ్డారు. మహిళలంటే అందమే కాదు, ఆమె శక్తి సామర్థ్యాలు కూడా.. ఆ విషయాన్ని కాంగ్రెస్ ఎంపీ గుర్తించాలని కోరారు. ఫొటో అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో చివరకు శశిధరూర్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే మహిళా ఎంపీలు కోరడం వల్లే తాను ఫొటో దిగానని, వారి కోరిక మేరకే తాను ఆ ఫొటో సోషల్ మీడియాలో పెట్టాల్సి వచ్చిందని చెప్పారు శశిధరూర్. సరదాకోసం అలా ట్వీట్ చేశాను కానీ ఎవరి మనోభావాలను నొప్పించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలన్నారు. శశిధరూర్ తో కలసి దిగిన సెల్ఫీలో ఎంపీలు సుప్రియా సూలే, ప్రణీత్‌ కౌర్‌, తమిళచ్చి తంగపాండియన్‌, మిమి చక్రవర్తి, నుస్రత్‌ జహాన్‌, జ్యోతిమణి ఈ ఫొటోలో ఉన్నారు.

ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకేనా..
అయితే అదేరోజు లోక్ సభలో చర్చ లేకుండానే వ్యవసాయ బిల్లుల్ని వెనక్కి తీసుకోవడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆ విమర్శలను ఎదుర్కోలేకే.. ఇలాంటి చిన్న చిన్న విషయాలను పెద్దవి చేస్తూ అధికారపక్షానికి చెందిన కొందరు సీన్ క్రియేట్ చేశారని మండిపడ్డారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. మొత్తమ్మీద శశిధరూర్ లో మహిళా ఎంపీల సెల్ఫీ.. చినికి చినికి గాలివానలా మారి.. చివరకు క్షమాపణల వరకు వెళ్లింది.

Tags:    
Advertisement

Similar News