మద్యపాన రహిత రాష్ట్రంగా బీహార్.. ప్రతిజ్ఞలతో పనిజరుగుతుందా..?

మద్యపానం ముట్టం, మద్యం తయారుచేయం, మద్యంతో వ్యాపారం చేయం.. అంటూ బీహార్ వాసులు ప్రతిజ్ఞ చేశారు. బీహార్ లోని చిన్నా పెద్దా, ఆడ, మగ, రాజకీయ నాయకులు, అధికారులు అనే తేడా లేకుండా.. అందరితో సామూహిక ప్రతిజ్ఞ చేశారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. బీహార్ మద్యపాన నిషేధంపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మద్యాన్ని నిషేధించడంతోపాటు.. ఇలా అందరితో సామూహిక ప్రతిజ్ఞ చేయించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు సీఎం నితీష్ కుమార్. మద్యపానం వల్ల ఆరోగ్యాలు […]

Advertisement
Update:2021-11-27 11:07 IST

మద్యపానం ముట్టం, మద్యం తయారుచేయం, మద్యంతో వ్యాపారం చేయం.. అంటూ బీహార్ వాసులు ప్రతిజ్ఞ చేశారు. బీహార్ లోని చిన్నా పెద్దా, ఆడ, మగ, రాజకీయ నాయకులు, అధికారులు అనే తేడా లేకుండా.. అందరితో సామూహిక ప్రతిజ్ఞ చేశారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. బీహార్ మద్యపాన నిషేధంపై కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. మద్యాన్ని నిషేధించడంతోపాటు.. ఇలా అందరితో సామూహిక ప్రతిజ్ఞ చేయించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు సీఎం నితీష్ కుమార్. మద్యపానం వల్ల ఆరోగ్యాలు చెడిపోవడమే కాదు, కుటుంబాలు నాశనం అవుతున్నాయని చెప్పారాయన. అందుకే తమ రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని అన్నారు.

“నితీష్ కుమార్ అనే నేను… ఈ రోజు (నవంబర్ 26, 2021) నుంచి జీవితాంతం మద్యం సేవించనని నిశ్చితాభిప్రాయంతో ప్రమాణం చేస్తున్నాను. నేను డ్యూటీలో ఉన్నా లేకపోయినా మద్యం సేవించను. రోజువారీ జీవితంలో కూడా మద్యం సేవించనని ప్రమాణం చేస్తున్నాను.” అంటూ తనతోపాటు అందరితో ఒట్టు వేయించారు నితీష్ కుమార్.

ఇటీవల గుజరాత్ లో మాంసం దుకాణాలు మూసివేయించేందుకు బీజేపీకి చెందిన కొందరు నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే శరీరానికి సత్తువనిచ్చే మాంసాహారం కంటే.. ఆరోగ్యానికి హాని చేసే మద్యంపై నిషేధం విధించాలంటూ అక్కడ నాయకులపై ఒత్తిడి పెరిగింది. కానీ వారు ఆ పని చేయలేకపోయారు, ఇక్కడ బీహార్ లో సీఎం నితీష్ కుమార్ మద్యపాన నిషేధాన్ని చేసి చూపిస్తామంటూ నడుం బిగించారు. అయితే ప్రతిజ్ఞలతో పని జరుగుతుందా.. ప్రభుత్వం ఎంతకాలం ఈ ఒట్టు తీసి గట్టున పెట్టకుండా ఉంటుందో చూడాలంటున్నారు కొంతమంది.

దాదాపుగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. అయితే బీహార్ సీఎం నితీష్ మాత్రం ఈ ఆదాయం కంటే.. మద్యం తాగడం వల్ల, అనారోగ్య సమస్యలతో ప్రజలు ఆస్పత్రులకోసం ఖర్చుపెడుతున్న సొమ్మే ఎక్కువగా ఉందని అంటున్నారు. అందుకే సంపూర్ణ మద్యపాన నిషేధంవైపు అడుగు వేసినట్టు చెబుతున్నారు. గతంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. తర్వాత కాలంలో వెసులుబాట్లతో దాన్ని ఉపసంహరించుకున్నాయి. మరి బీహార్ లో ఈ నిర్ణయం ఎంతకాలం అమలులో ఉంటుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News