తమిళనాడులో వర్ష బీభత్సం : 8 మంది మృతి..!

తమిళనాడు రాష్ట్రంలో మూడు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే భారీ వర్షాలతో అక్కడ 8 మంది మృతి చెందారు. కొమరిన్ ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు […]

Advertisement
Update: 2021-11-27 09:06 GMT

తమిళనాడు రాష్ట్రంలో మూడు వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరుసగా తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే భారీ వర్షాలతో అక్కడ 8 మంది మృతి చెందారు. కొమరిన్ ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంతో పాటు పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వర్షంతో నిన్న ఒక్కరోజే తమిళనాడులో ముగ్గురు చనిపోగా, ఇవాళ మరో ఐదుగురు చనిపోయారని రాష్ట్ర విపత్తుల నిర్వహణ మంత్రి కేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ తెలిపారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. పాఠశాలలకు సెలవు కూడా ఇచ్చింది.

కాగా దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత అది 48 గంటల్లో క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని చెప్పారు.

వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో మోస్తరు, తమిళనాడుతో పాటు ఏపీలోని రాయలసీమ, దక్షిణ కోస్తాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. కాగా ఉపరితల ఆవర్తనం కారణంగా తమిళనాడుతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News