ఆన్ లైన్ అప్పు.. 600 యాప్ లతో ముప్పు..

వడ్డీ వ్యాపారస్తులు అప్పులివ్వాలంటే ఏదో ఒకటి తనఖా పెట్టుకుంటారు. బ్యాంకులు కూడా బంగారం, ఇంటి పత్రాలు, పొలం పాస్ బుక్ లు లేనిదే అప్పులివ్వవు. పర్సనల్ లోన్లు ఇచ్చినా.. ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో చూసే ఇస్తాయి. కానీ ఆన్ లైన్ లో అప్పులిచ్చే యాప్ లు అలా కాదు. ఉద్యోగం, వ్యాపారం ఏదీ లేకపోయినా.. అప్పులిచ్చేస్తామంటూ వెంటబడతాయి. వీటి రా అప్పులు తీసుకుంటే మన మర్యాద వారికి తాకట్టు పెట్టినట్టే. ఏ ఒక్క నెల కిస్తీ కట్టడం లేటయినా […]

Advertisement
Update:2021-11-21 07:06 IST

వడ్డీ వ్యాపారస్తులు అప్పులివ్వాలంటే ఏదో ఒకటి తనఖా పెట్టుకుంటారు. బ్యాంకులు కూడా బంగారం, ఇంటి పత్రాలు, పొలం పాస్ బుక్ లు లేనిదే అప్పులివ్వవు. పర్సనల్ లోన్లు ఇచ్చినా.. ఉద్యోగాన్నో, వ్యాపారాన్నో చూసే ఇస్తాయి. కానీ ఆన్ లైన్ లో అప్పులిచ్చే యాప్ లు అలా కాదు. ఉద్యోగం, వ్యాపారం ఏదీ లేకపోయినా.. అప్పులిచ్చేస్తామంటూ వెంటబడతాయి. వీటి రా అప్పులు తీసుకుంటే మన మర్యాద వారికి తాకట్టు పెట్టినట్టే. ఏ ఒక్క నెల కిస్తీ కట్టడం లేటయినా వెంటనే మన ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్న నెంబర్లన్నిటికీ మెసేజ్ వెళ్లిపోతుంది. ఫలానా వారు మాకు బాకీ పడ్డారు, మిమ్మల్ని గ్యారెంటీగా పెట్టారంటూ భయపెట్టేలా సందేశాలు పంపిస్తారు. ఆ దెబ్బకి, ఆ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆన్ లైన్ అప్పుల యాప్ లపై ఏడాది కాలంలో ఆర్బీఐకి 2562 ఫిర్యాదులందాయి.

అప్పుల ఊబిలోకి సింపుల్ గా దించేస్తారు..
ఐదు నిముషాల్లో లోన్, డాక్యుమెంట్లు అవసరం లేదు, ఎలాంటి సంతకాలు పనిలేదు, ఎవరూ గ్యారెంటీ వద్దు.. అంటూ ఆన్ లైన్ యాప్ లు సులభంగా మధ్యతరగతి వారికి గేలమేస్తుంటాయి. అయితే నూటికి 15 నుంచి 20 రూపాయల వరకు వడ్డీ ఉంటుంది. వాస్తవానికి అత్యవసరం అయితేనే ఆ వడ్డీరేటుకి ఎవరైనా అప్పు తీసుకుంటారు. కానీ ఆన్ లైన్ యాప్ లలో ఊరించే ప్రకటనలతో ఈఎంఐల లెక్కలో ఈజీగా బుట్టలో పడిపోతుంటారు మధ్యతరగతి ప్రజలు. విద్యార్థులకు సైతం సులభంగా ఇలాంటి యాప్ లు అప్పులిచ్చేస్తుంటాయి. అప్పులిచ్చే క్రమంలో మన ఫోన్ కాంటాక్స్ ని వాడుకునే అనుమతి కూడా తీసుకుంటాయి. అలా మనచేతే మన పరువుని తాకట్టు పెట్టించుకుంటాయి.

600 అనధికార యాప్ లు..
అప్పులివ్వడం బ్యాంకుల పని. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు సైతం ఆర్బీఐ అలాంటి అనుమతులిచ్చింది. అయితే ఇప్పుడు ఆన్ లైన్ లో కనిపించే యాప్ లు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వ్యాపారాలను మొదలు పెడుతున్నాయి. 1100కి పైగా ఇలాంటి యాప్ లు లోన్లు ఇస్తున్నాయి. ఎన్.ఎఫ్.బి.సి. లు నిర్వహించే యాప్ లు మినహాయిస్తే.. అనుమతి లేకుండా భారత్ లో 600 యాప్ లు ఇలా లోన్లు ఇస్తున్నట్టు ఆర్బీఐ తేల్చింది. వీటి బాధితులు ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్నారు. కర్నాటక, ఢిల్లీ, హర్యానా, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇలా ఆన్ లైన్ లో అప్పులు తీసుకుని ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పటికే ఇలాంటి ఫిర్యాదులపై కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. చాలా వరకు అనధికారిక యాప్ లపై నిషేధం విధించినా.. ఆన్ లైన్ వ్యవహారంపై సరైన నియంత్రణ లేకపోవడంతో కొత్త కొత్త యాప్ లన్నీ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News