విద్యార్థులకోసం కొత్త భాషలు నేర్చుకుంటున్న టీచర్లు..
గిరిజన పిల్లలు అప్పటి వరకూ వారి స్థానిక భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా స్కూల్ లో చేర్పించగానే అందరితో కలసి కొత్త భాష నేర్చుకోవాల్సిన పరిస్థితి. అంతా కొత్తగా ఉంటుంది, తాము ఇంట్లో మాట్లాడే భాష వేరు, స్కూల్ లో చెప్పే పాఠాలు వేరు. ఎక్కడా ఏదీ అర్థం కాదు. పోనీ విడమరచి చెప్పేందుకు చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులకు కూడా అంత పరిజ్ఞానం ఉండదు. ఇలాంటి కష్టాలు తీర్చేందుకు ఒడిశా ప్రభుత్వం ‘సంహతి’ పేరుతో కొత్త […]
గిరిజన పిల్లలు అప్పటి వరకూ వారి స్థానిక భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా స్కూల్ లో చేర్పించగానే అందరితో కలసి కొత్త భాష నేర్చుకోవాల్సిన పరిస్థితి. అంతా కొత్తగా ఉంటుంది, తాము ఇంట్లో మాట్లాడే భాష వేరు, స్కూల్ లో చెప్పే పాఠాలు వేరు. ఎక్కడా ఏదీ అర్థం కాదు. పోనీ విడమరచి చెప్పేందుకు చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులకు కూడా అంత పరిజ్ఞానం ఉండదు. ఇలాంటి కష్టాలు తీర్చేందుకు ఒడిశా ప్రభుత్వం ‘సంహతి’ పేరుతో కొత్త ప్రాజెక్ట్ ని తెరపైకి తెచ్చింది. పిల్లలకోసం టీచర్లే కొత్త భాషలు నేర్చుకునేలా ప్రోత్సహిస్తోంది. ఒడిశాలో రాష్ట్ర అధికార భాష ఒడియాతోపాటు.. గిరిజనులు మాట్లాడుకునే సంతాలి అనే భాషకి గుర్తింపు ఉంది. ఇవి కాకుండా మొత్తం 21 గిరిజన భాషలు ఒడిశాలో ఉన్నాయి. వాటికి లిపి ఉండదు, కానీ పిల్లలు తల్లిదండ్రుల దగ్గర అదే నేర్చుకుంటారు. స్కూల్ వయసు రాగానే.. మిగతా భాషల్ని కొత్తగా నేర్చుకునే ప్రయత్నం మొదలు పెడతారు. ఈ క్రమంలో చాలామంది అసలు స్కూల్ కే ఎగనామం పెట్టే పరిస్థితి. దీన్ని నివారించేందుకే ఇప్పుడు ఒడిశా ప్రభుత్వం ‘సంహతి’ ప్రాజెక్ట్ కి రూపకల్పన చేసింది.
పిల్లలకోసం టీచర్లు..
ఒడిశాలో ఎస్సీ, ఎస్టీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్టూట్, ట్రైబల్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అకాడమీ సంయుక్థ ఆధ్వర్యంలో ఈ ‘సంహతి’ ప్రాజెక్ట్ మొదలైంది. ఒడిశా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకోసం 1732 రెసిడెన్షియల్ స్కూల్స్ నడుపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 4.5లక్షలమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే వీరికి భాషా సమస్యలు అనేకం. దీన్ని నివారించేందుకు టీచర్లు కొత్తగా వారి భాష నేర్చుకుంటున్నారు. ప్రాథమిక స్థాయిలో 3328మంది టీచర్లు, 222మంది భాషా పండితులకు శిక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి. వీరందరూ గిరిజన భాషల్లో పట్టు సాధించి.. గిరిజన విద్యార్థులకు వారి భాషలోనే బోధన మొదలు పెడతారు. ప్రాథమిక స్థాయి దాటే వరకు గిరగిజన భాషల్లోనే వారికి అనుమానాలు నివృత్తి చేస్తారు. హైస్కూల్ లెవల్ కి వెళ్లే సమయానికి పిల్లల్లో భాషా భయం పోవాలనేది ప్రభుత్వం ఆలోచన.
నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం.. ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన వారి మాతృభాషలోనే జరగాలి. అంటే గిరిజన విద్యార్థులు వారి మాతృభాషలోనే పాఠాలు నేర్చుకోవాలి. కానీ ఒడిశాలో ఇప్పటి వరకూ అది జరగలేదు. దీంతో గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, చదువంటేనే భయపడిపోతున్నారు, చాలామంది డ్రాపవుట్స్ గా మిగిలిపోతున్నారు. దీనికోసం ఇప్పుడు టీచర్లకే భాషలు నేర్పిస్తోంది ఒడిశా ప్రభుత్వం.