బ్రహ్మచారులు కేరాఫ్ తమిళనాడు

తమిళనాడులో బ్రాహ్మణ సామాజిక వర్గంలో కొంతకాలంగా ఓ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 45ఏళ్ల వయసు వచ్చినా కూడా పెళ్లికాకుండా మిగిలిపోతున్న యువకుల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. ప్రస్తుతం అలాంటి వారి సంఖ్య ఏకంగా 40వేలు దాటింది. తమిళనాడులో అమ్మాయిలు దొరక్క పెళ్లి వాయిదా వేసుకున్న బ్రాహ్మణ యువకులు 40వేలమంది తమకు వివాహయోగం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికోసం స్థానిక బ్రాహ్మణ సమాజం ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. అసలు కారణం ఇదీ..! తమిళనాడులో ఏడాదికేడాది […]

Advertisement
Update:2021-11-18 03:45 IST

తమిళనాడులో బ్రాహ్మణ సామాజిక వర్గంలో కొంతకాలంగా ఓ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 45ఏళ్ల వయసు వచ్చినా కూడా పెళ్లికాకుండా మిగిలిపోతున్న యువకుల సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. ప్రస్తుతం అలాంటి వారి సంఖ్య ఏకంగా 40వేలు దాటింది. తమిళనాడులో అమ్మాయిలు దొరక్క పెళ్లి వాయిదా వేసుకున్న బ్రాహ్మణ యువకులు 40వేలమంది తమకు వివాహయోగం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అలాంటి వారందరికోసం స్థానిక బ్రాహ్మణ సమాజం ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది.

అసలు కారణం ఇదీ..!
తమిళనాడులో ఏడాదికేడాది బ్రాహ్మణ సామాజిక వర్గంలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతోంది. 10మంది అబ్బాయిలకు కేవలం ఆరుగురు అమ్మాయిలు మాత్రమే ఉన్నారు. ఆడపిల్లల తల్లిదండ్రులంతా సాఫ్ట్ వేర్ అల్లుళ్ల కోసం వేచి చూస్తున్నారు. దీంతో స్థానికంగా పూజారి వృత్తిలో ఉండేవారికి పిల్లలు దొరకడం కష్టంగా మారింది. మరోవైపు తమిళనాడు బ్రాహ్మణ సామాజిక వర్గంలో వివాహ ఖర్చులు కేవలం అమ్మాయి తరపు వారు మాత్రమే భరించాలనే ఆచారం ఇప్పటికీ ఉంది. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ సొమ్ము సమకూర్చుకోడానికి చాన్నాళ్లపాటు వేచి చూస్తున్నారు. ఇది కూడా ఒకరకంగా వధువుల కొరతకు కారణం అయిందని చెబుతున్నారు.

చలో బీహార్, యూపీ..
వధువుల కొరతతో ఇప్పుడు తమిళనాడు బ్రాహ్మణ బ్రహ్మచారులు చలో బీహార్, యూపీ అంటున్నారు. తమిళనాడుకి చెందిన బ్రాహ్మణ సేవా సంఘం ఉత్తర ప్రదేశ్, బీహార్ లో వివాహ పరిచయ వేదికలు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అసోసియేషన్ పత్రికలో ఈ వివరాలు ఉంచింది. యూపీ, బీహార్ లో ఉన్న బ్రాహ్మణ సంఘాలకు సమాచారం ఇచ్చింది. ప్రస్తుతం బీహార్, యూపీలకు చెందిన పెళ్లి సంబంధాలు కుదిర్చేవారికి తమిళనాడులో డిమాండ్ పెరిగింది. తమిళనాడుకి చెందిన బ్రాహ్మణ యువకులు ఇప్పుడిప్పుడే పెళ్లి చూపులకోసం యూపీ, బీహార్ వెళ్తున్నారు. అలా తమిళనాట వధువుల కొరతతో.. యూపీ, బీహార్ తో వియ్యమందుకునే కార్యక్రమం జోరందుకుంది.

Tags:    
Advertisement

Similar News