పీఎం కేర్స్ పేరుతో వెంటిలేటర్ల కుంభకోణం..

పీఎం కేర్స్ అంటూ భారత ప్రధాని పేరుతో సాగిన విరాళాల సేకరణ గతంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రైమ్‌ మినిస్టర్‌ సిటిజెన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్‌ ఫండ్‌ అనే పేరుతో సేకరించిన విరాళాల జమా ఖర్చులపై దాఖలైన ఆర్టీఐ పిటిషన్లకు సమాధానమే లేదు. అది పబ్లిక్‌ అథారిటీ కాదని, ఆర్టీఐ చట్టం పరిధిలోకి రాదని ఫండ్ నిర్వాహకులు తేల్చి చెప్పడంతో అప్పట్లో వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పీఎం […]

Advertisement
Update:2021-11-09 06:32 IST

పీఎం కేర్స్ అంటూ భారత ప్రధాని పేరుతో సాగిన విరాళాల సేకరణ గతంలోనే వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రైమ్‌ మినిస్టర్‌ సిటిజెన్‌ అసిస్టెన్స్‌ అండ్‌ రిలీఫ్‌ ఇన్‌ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్‌ ఫండ్‌ అనే పేరుతో సేకరించిన విరాళాల జమా ఖర్చులపై దాఖలైన ఆర్టీఐ పిటిషన్లకు సమాధానమే లేదు. అది పబ్లిక్‌ అథారిటీ కాదని, ఆర్టీఐ చట్టం పరిధిలోకి రాదని ఫండ్ నిర్వాహకులు తేల్చి చెప్పడంతో అప్పట్లో వివాదం మరింత ముదిరింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పీఎం కేర్స్ పై ప్రధాని కార్యాలయం స్పందించింది. నిధుల్లో 2వేల కోట్ల రూపాయలను 50,000 వెంటిలేటర్లు కొనడానికి ఉపయోగించామని, వెయ్యి కోట్లను వలస కూలీల సంక్షేమానికి ఉపయోగించామని, వ్యాక్సిన్‌ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయించామని వెల్లడించింది.

తాజాగా బయటపడిన మరో కుంభకోణం..
పీఎం కేర్స్ నిధులతో వెంటిలేటర్ల కొనుగోలు కార్యక్రమం పెద్ద కుంభకోణం అనే విషయం ఇప్పుడు రుజువవుతోంది. తాజాగా శ్రీనగర్ లోని ఎస్ఎంహెచ్ఎస్ అనే ఆస్పత్రిలో పీఎం కేర్స్ తరపున పంపిన వెంటిలేటర్లలో ఒక్కటి కూడా పనిచేయడంలేదని, వాటిని పూర్తిగా వెనక్కి తిప్పి పంపించేశారని ఆర్టీఐ దరఖాస్తులో తేలింది. ఈ ఆస్పత్రికి మొత్తం 37 వెంటిలేటర్లు పీఎం కేర్స్ సహాయం కింద అందించారు. అయితే వాటిలో ఒక్కటి కూడా పనికి రాలేదు. వాటి నాణ్యత సరిగా లేదు, టెస్ట్ రన్ లోనే అన్నీ విఫలం అయ్యాయి. దీంతో వాటన్నిటినీ వెనక్కి పంపించేశామని ఆస్పత్రి నిర్వాహకులుల తెలిపారు. బల్వీందర్ సింగ్ అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐ కింద దరఖాస్తు చేసుకోడా ఈ వివరాలు తెలిశాయి.

వెంటిలేటర్ల స్కామ్..
50వేల మేకిన్ ఇండియా వెంటిలేటర్ల కోసం పీఎం కేర్స్ నుంచి 2వేల కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆమేర కరోనా సెకండ్ వేవ్ విజృంభించిన సమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు అందుబాటులో లేవు. వెంటిలేటర్ల సరఫరా కోసం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో కూడా చాలా లొసుగులు ఉన్నాయనే ఆరోపణలు వినిపించాయి. నిబంధనలు సడలించి అస్మదీయులకు కాంట్రాక్ట్ లు కట్టబెట్టారని కూడా ప్రచారం జరిగింది. వెంటిలేటర్ల కొరతపై గతంలో ప్రభుత్వం ప్రశ్నలు ఎదుర్కోగా.. వాటి పనితీరు సరిగా లేక కొన్ని ఆర్డర్లు క్యాన్సిల్ చేసినట్టు చెప్పారు. అయితే ఇప్పుడీ వెంటిలేటర్ల పనితీరుపై మరోసారి తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. శ్రీనగర్ ఆస్పత్రికి ఇచ్చిన వెంటిలేటర్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా పనిచేయకపోవడం విచిత్రం. ఇలాంటి వాటికోసం కేంద్ర ప్రభుత్వం 2 వేల కోట్లు ఖర్చు చేయడం మరింత విచిత్రం.

Tags:    
Advertisement

Similar News