వాటర్ షెడ్ ప్రోగ్రామ్ లో ఏపీ టాప్..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్ షెడ్ కార్యక్రమంలో ఏపీ మంచి ఫలితాలు సాధించిందని కితాబిచ్చారు భూ వనరుల విభాగం సీనియర్ అడిషనల్ కమిషనర్ సీపీ రెడ్డి. కేటాయించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా దేశంలోనే టాప్ 5 రాష్ట్రాల్లో ఏపీ స్థానం సంపాదించిందని అన్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం వాటర్ షెడ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. 2294 కోట్ల రూపాయలతో ఏపీకి మొత్తం 373 ప్రాజెక్ట్ లను కేంద్రం […]

Advertisement
Update:2021-11-07 07:30 IST

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్ షెడ్ కార్యక్రమంలో ఏపీ మంచి ఫలితాలు సాధించిందని కితాబిచ్చారు భూ వనరుల విభాగం సీనియర్ అడిషనల్ కమిషనర్ సీపీ రెడ్డి. కేటాయించిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం ద్వారా దేశంలోనే టాప్ 5 రాష్ట్రాల్లో ఏపీ స్థానం సంపాదించిందని అన్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం వాటర్ షెడ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది.

2294 కోట్ల రూపాయలతో ఏపీకి మొత్తం 373 ప్రాజెక్ట్ లను కేంద్రం కేటాయించింది. ఇందులో ఇప్పటికే 261 ప్రాజెక్ట్ లు పూర్తయ్యాయి. 112 ప్రాజెక్ట్ లను ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి 69 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంది. వాస్తవానికి సెప్టెంబర్ నెలాఖరు నాటికి అన్ని ప్రాజెక్ట్ లను పూర్తి చేయాల్సి ఉండగా.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు కేంద్రం గడువు పెంచింది.

వాటర్ షెడ్ కార్యక్రమం ద్వారా 2.6 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యాన్ని అదనంగా కల్పించాల్సి ఉంటుంది. మొత్తం 13.45 లక్షల హెక్టార్ల భూమి ప్రభావితం అయ్యేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మొక్కల పెంపకం, సామాజిక వనాలను పెంచడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం దీని లక్ష్యం. వాటర్ షెడ్ కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనుల్ని చిన్న చిన్న ప్రాజెక్ట్ లుగా రూపొందిస్తారు. త్వరలో వాటర్ షెడ్ 2.ఓ అనే కార్యక్రమానికి రూపకల్పన సాగుతోందని తెలిపారు అధికారులు. దేశవ్యాప్తంగా 50లక్షల హెక్టార్ల భూమికి అదనంగా సాగునీటి సౌకర్యం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఏపీలో ప్రాజెక్ట్ అమలు తీరుపై వారు సంతోషం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News