రైతుల ఆత్మహత్యలు తగ్గాయి.. రైతు కూలీల బలవన్మరణాలు పెరిగాయి..

భారత్ లో 2020లో జరిగిన ఆత్మహత్యల లెక్కలు తీసుకుంటే.. రైతు కూలీల మరణాలు 18శాతం పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం.. గతేడాది దేశవ్యాప్తంగా లక్షా 53వేలమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 37,666మంది రోజువారీ కూలీలేనని తేలింది. వీరిలో 7శాతం మంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. 10,677మంది వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గతేడాది లాక్ డౌన్ పరిస్థితులు అందరి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. అదే సమయంలో వాతావరణ పరిస్థితులు […]

Advertisement
Update:2021-10-30 04:51 IST

భారత్ లో 2020లో జరిగిన ఆత్మహత్యల లెక్కలు తీసుకుంటే.. రైతు కూలీల మరణాలు 18శాతం పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం.. గతేడాది దేశవ్యాప్తంగా లక్షా 53వేలమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిలో 37,666మంది రోజువారీ కూలీలేనని తేలింది. వీరిలో 7శాతం మంది వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. 10,677మంది వ్యవసాయ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. గతేడాది లాక్ డౌన్ పరిస్థితులు అందరి జీవితాలను చిన్నాభిన్నం చేశాయి. అదే సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో సాగు పనులు జోరుగా సాగాయి. పీఎం కిసాన్ వంటి పథకాలతో ఆర్థిక ప్రయోజనాలు కూడా అందడంతో.. వ్యవసాయదారులు కాస్తో కూస్తో కుదుటపడ్డారు. కానీ వ్యవసాయ కూలీలకు మాత్రం ఇలాంటి ప్రయోజనాలు దక్కలేదు.

మరోవైపు సొంతగా వ్యవసాయం చేసుకునే రైతులు కరోనా కష్టాల్లోనూ వ్యవసాయ పనులతో కుదుటపడ్డారు. 2019లో రైతుల ఆత్మహత్యలు 5,129 కాగా.. 2020లో ఆ సంఖ్య 4,940కి పరిమితం కావడం సంతోషించదగ్గ పరిణామం. కౌలు రైతుల ఆత్మహత్యల విషయంలోనూ తగ్గుదల కనిపించడం విశేషం. 2019లో 828మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా.. 2020లో వారి సంఖ్య 639కి పరిమితం అయింది.

రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యల్లో స్వల్ప తగ్గుదల కనిపించినా.. రైతు కూలీల ఆత్మహత్యలు పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అత్యథికంగా మహారాష్ట్రలో వ్యవసాయ ఆధారిత పనులతో బతికేవారు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా రైతు కూలీల ఆత్మహత్యల్లో 18శాతం పెరుగుదల తీవ్ర ఆందోళన కలిగించే పరిణామం.

Tags:    
Advertisement

Similar News