భారత వాహన రంగంపై చిప్ ల దెబ్బ..

చూడ్డానికి చిన్నవే కానీ, వాహన రంగంలో అవే కీలకం. సెమీ కండక్టర్స్ లేదా చిప్ లు అని పిలుచుకునే ఈ అంతర్గత విభాగాలు ఆధునిక వాహనాలకు అత్యవసరం. ఈ చిప్ ల సాయంతోనే వాహనాల నేవిగేషన్ సిస్టమ్, వినోద సంబంధమైన విభాగాలు పనిచేస్తాయి. కొత్త తరం వాహనాలను ఇవి లేకుండా ఊహించలేం. అయితే కరోనా పరిస్థితుల వల్ల చిప్ ల దిగుమతి భారీగా పడిపోయింది. చిప్ తయారు చేసే OEM (ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మ్యాన్యుఫ్యాక్చర్) లు […]

Advertisement
Update:2021-10-27 04:36 IST

చూడ్డానికి చిన్నవే కానీ, వాహన రంగంలో అవే కీలకం. సెమీ కండక్టర్స్ లేదా చిప్ లు అని పిలుచుకునే ఈ అంతర్గత విభాగాలు ఆధునిక వాహనాలకు అత్యవసరం. ఈ చిప్ ల సాయంతోనే వాహనాల నేవిగేషన్ సిస్టమ్, వినోద సంబంధమైన విభాగాలు పనిచేస్తాయి. కొత్త తరం వాహనాలను ఇవి లేకుండా ఊహించలేం. అయితే కరోనా పరిస్థితుల వల్ల చిప్ ల దిగుమతి భారీగా పడిపోయింది. చిప్ తయారు చేసే OEM (ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మ్యాన్యుఫ్యాక్చర్) లు వాటిని డిమాండ్ మేరకు పంపిణీ చేయలేకపోతున్నాయి. దీంతో చిప్ లు దిగుమతి కాక భారత వాహనరంగం ఈ త్రైమాసికంలో ఆశించిన వృద్ధిని నమోదు చేయలేదు.

కరోనా తర్వాత భారత్ లో వ్యక్తిగత వాహనాల వాడకం భారీగా పెరిగింది. ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఏ వాహనాన్ని కొనాలన్నా స్టాక్ లేదు, రెండు మూడు నెలల తర్వాత మాత్రమే వస్తుందని చెబుతున్నారు. కార్ల కంపెనీ ఏదయినా లీడింగ్ బ్రాండ్లు మాత్రం దొరకడంలేదు. గతంలో 2 నుంచి 3 నెలల తర్వాతే అని చెప్పేవారు కాస్తా.. ఇటీవల కాలంలో 6నుంచి 9 నెలలు వేచి చూస్తే కానీ మనం కోరుకున్న మోడల్ ని కొనుక్కోలేం. భారత్ లో వ్యక్తిగత వాహన రంగంలో 11నుంచి 13శాతం మాత్రమే పెరుగుదల ఉంటుందని ఇటీవల క్రిసిల్ రేటింగ్ వెలువడటం గమనార్హం. వాస్తవానికి పండగ సీజన్లో అంతకంటే భారీగా డిమాండ్ ఉన్నా కూడా.. చిప్ ల కొరత కారణంగా వ్యక్తిగత వాహనాలు మార్కెట్ లోకి రాలేకపోతున్నాయి.

ప్రీమియం బ్రాండ్లకే పరిమితం..
ప్రస్తుతం భారత్ కి పరిమితంగా దిగుమతి అవుతున్న చిప్ లు కేవలం ప్రీమియం బ్రాండ్లకోసమే ఉపయోగిస్తున్నారు. మరోవైపు అత్యవసరమైన యుటిలిటీ వెహికల్స్ కి కూడా వీటిని వినియోగిస్తున్నారు. దీంతో మధ్యతరగతి నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న ఎకానమీ బ్రాండ్లు మార్కెట్లోకి రావడంలేదు. దీంతో సేల్స్ కూడా ఆశించిన స్థాయిలో పెరగడంలేదని చెబుతున్నారు. మొత్తమ్మీద కరోనా కష్టాలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న ఈ దశలో.. వ్యక్తిగత వాహన రంగంపై చిప్ ల కొరత తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా చిప్ ల దిగుమతి పైనే ఆధారపడిన భారత్ వంటి దేశాలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News