1000 అడుగుల ఎత్తు వరకే డ్రోన్లకు అనుమతి.. కేంద్రం కొత్త నిబంధనలు..

దేశంలో డ్రోన్ల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ నేపథ్యంలో కేంద్రం వాటి నియంత్రణకోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. విమానాల నియంత్ర‌ణ కోసం ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ మేనేజ్‌ మెంట్ సిస్టం ఇప్పటికే అమలులో ఉంది. అయితే డ్రోన్లు మానవ రహితం కాబట్టి.. అన్ మ్యాన్డ్ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టమ్ ను కొత్తగా అమలులోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఎవరికి వారే డ్రోన్లు ఎగరేస్తామంటే కుదరదు, ఎంత ఎత్తులో అయినా డ్రోన్లు తిప్పేస్తామంటే […]

Advertisement
Update:2021-10-27 14:18 IST

దేశంలో డ్రోన్ల వినియోగం క్ర‌మంగా పెరుగుతున్న‌ నేపథ్యంలో కేంద్రం వాటి నియంత్రణకోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. విమానాల నియంత్ర‌ణ కోసం ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ మేనేజ్‌ మెంట్ సిస్టం ఇప్పటికే అమలులో ఉంది. అయితే డ్రోన్లు మానవ రహితం కాబట్టి.. అన్ మ్యాన్డ్ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టమ్ ను కొత్తగా అమలులోకి తెచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై ఎవరికి వారే డ్రోన్లు ఎగరేస్తామంటే కుదరదు, ఎంత ఎత్తులో అయినా డ్రోన్లు తిప్పేస్తామంటే అస్సలు కుదరదు. ప్రతీ డ్రోన్ కీ లెక్క ఉంటుంది. ఎంత పరిధిలో ఎగరాలనేదానికి కూడా నిబంధనలు రూపొందించారు.

అది ఏటీఎం, ఇది యూటీఎం..
విమానాలకోసం రూపొందించిన ఎయిర్ క్రాఫ్ట్ ట్రాఫిక్ మేనేజ్‌ మెంట్ సిస్టం – ఏటీఎం అయితే.. డ్రోన్లకోసం రూపొందించిన అన్ మ్యాన్డ్ ఎయిర్‌ క్రాఫ్ట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌ మెంట్‌ సిస్టం ను యూటీఎంగా పేర్కొంటున్నారు. ఇప్ప‌టికే ర‌క్ష‌ణ‌, ఆరోగ్యం, ఆహారం వంటి రంగాల‌లో డ్రోన్ టెక్నాల‌జీని వినియోగిస్తున్నారు. భ‌విష్య‌త్తులో అన్ని రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగే అవ‌కాశం ఉండ‌టంతో కేంద్ర పౌర విమానయాన శాఖ కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిటల్‌ స్కై వ్యవస్థ ద్వారా డ్రోన్‌ నిర్వాహకులు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ ఆటోమేటిక్ సాఫ్ట్‌ వేర్ ఆధారంగా ప‌నిచేస్తుంది.

వెయ్యి అడుగుల గరిష్ట ఎత్తు వరకే..
ఇప్పటి వరకు డ్రోన్లను వాటి సామర్థ్యం మేరకు గరిష్ట ఎత్తుకు ఎగరేస్తున్నారు. అత్యాథునిక డ్రోన్లను కంటికి కనిపించకుండా అత్యథిక ఎత్తులో ఎగరేసే అవకాశముంది. ఇకపై ఇలాంటి వాటికి అనుమతి ఉండదు. డ్రోన్లు ఏవయినా, వాటి సామర్థ్యం ఎంత ఉన్నా.. వెయ్యి అడుగల లోపు మాత్రమే అవి ఎగరాల్సి ఉంటుంది. డ్రోన్ల వినియోగంపై కేంద్రానికి ప్రతి నిర్వాహకుడు కూడా సమాచారం ఇవ్వాలి. అది ఏ సమయంలో ఎక్కడ ఎగురుతోందన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపిస్తుండాలి. థర్డ్ పార్టీ సేవలు అందించే సంస్థలు డ్రోన్ల నిర్వాహకుల తరపున ఈ బాధ్యతలు స్వీకరించవచ్చు. ఇలాంటి సేవలు అందించే సంస్థలు ఆటో మేటెడ్‌ అల్గారిథం సాఫ్ట్‌ వేర్‌ ఉపయోగించాలి. ఆ సాంకేతిక పరిజ్ఞానం పొందేందుకు ఆయా సంస్థలు డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ సేవలు అందించే సంస్థలకు తక్కువ పరిధిలో ఉండే ప్రాంతాన్ని కేటాయిస్తారు. క్రమక్రమంగా ఆ పరిధి విస్తరిస్తారు. ఈ సేవలు అందించినందుకు ఆ సంస్థలు రుసుములు వసూలు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. దీనిలో కొంత ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెల్లించాల్సి ఉంటుంది.

Tags:    
Advertisement

Similar News