అన్నాడీఎంకేను చేతుల్లోకి తీసుకుంటా.. శశికళ విస్పష్ట ప్రకటన

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి .. శశికళ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం పతనావస్థలో ఉన్న అన్నాడీఎంకే పార్టీని తాను చేతుల్లోకి తీసుకుంటానని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఒకప్పటి అన్నాడీఎంకే అధికారిక పత్రిక నమదు ఎంజీఆర్​లో శశికళ పేరిట ఓ వ్యాసం ప్రచురితమైంది. ఈ వ్యాసం ప్రస్తుతం తమిళనాడులో రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ‘తమిళనాడులో ఇప్పుడు అన్నాడీఎంకే పతనావస్థలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని నేను చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నాను. నిజమైన […]

Advertisement
Update:2021-10-08 04:40 IST

అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి .. శశికళ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుతం పతనావస్థలో ఉన్న అన్నాడీఎంకే పార్టీని తాను చేతుల్లోకి తీసుకుంటానని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఒకప్పటి అన్నాడీఎంకే అధికారిక పత్రిక నమదు ఎంజీఆర్​లో శశికళ పేరిట ఓ వ్యాసం ప్రచురితమైంది. ఈ వ్యాసం ప్రస్తుతం తమిళనాడులో రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.

‘తమిళనాడులో ఇప్పుడు అన్నాడీఎంకే పతనావస్థలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీని నేను చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నాను. నిజమైన అన్నాడీఎంకే అభిమానులు ఎవరైనా ఇలాగే ఆలోచిస్తారు. నా సంకల్పం ముందు ఎవరూ అడ్డు నిలవలేరు. విప్లవనాయకుడు ఎంజీఆర్​ , విప్లవ నాయకి జయలలిత కలలు గన్న తమిళనాడును నిర్మించడమే నా ముందున్న లక్ష్యం’ అంటూ ఆమె ఈ వ్యాసంలో పేర్కొన్నారు. దీంతో అన్నాడీఎంకే పార్టీలో ఏదో జరగబోతుంది అన్న వాదన వినిపిస్తోంది.

ఈ నెల 17 న తమిళనాడు వ్యాప్తంగా అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో పార్టీ నేతలంతా మెరీనా బీచ్​ లోని జయలలిత సమాధి వద్ద నివాళి అర్పించబోతున్నారు. అయితే అందుకు ఒక్కరోజు ముందే అంటే 16నే శశికళ .. జయ సమాధి వద్ద నివాళి అర్పించబోతున్నట్టు సమాచారం. అనంతరం రామాపురం వెళ్లి బధిరుల పాఠశాలను సందర్శించనున్నారు. అక్కడే తన భవిష్యత్​ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని తమిళనాడు పొలిటికల్​ సర్కిళ్లలో వార్తలు వినిపిస్తున్నాయి.

అన్నాడీఎంకే నేతల రియాక్షన్​ ఏంటి?

జైలు నుంచి విడుదల కాగానే.. పార్టీని తన గుప్పిట్లోకి తీసుకోవాలని శశికళ ప్రయత్నించారు. అయితే అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. అప్పుడు సీఎంగా ఉన్న పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం .. ఆమెను పార్టీ లోకి రానివ్వలేదు. ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేశారు. శశికళతో టచ్​ లో ఉన్న నేతలపై కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో ఆమె కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ పరిణామాల వెనక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉంటే మరోసారి శశికళ పార్టీలో యాక్టివ్​ కావాలని చూస్తున్నారు. ఆమెతో కొంతమంది పార్టీ నేతలు టచ్​ లో ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాలను బీజేపీ పెద్దలు సైతం గమనిస్తున్నారు. వారు ఎటువంటి వ్యూహం రచిస్తారో వేచి చూడాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పన్నీర్ సెల్వం, పళని స్వామి వంటి నేతల వల్ల అన్నాడీఎంకే బలపడటం సాధ్యం కాదు. స్టాలిన్​ లాంటి బలమైన నేతలను ఎదిరించాలంటే అది శశికళకే సాధ్యమని వాదించే వారున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలు శశికళ పొలిటికల్​ గా యాక్టివ్​ కావడాన్ని స్వాగతిస్తారో లేదో వేచి చూడాలి. శశికళ బీజేపీ పెద్దల కనుసన్నల్లోనే ఉందని .. వారి ప్రోద్బలంతోనే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నదని విశ్లేషించేవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా తమిళనాడు రాజకీయాలు మరోసారి ఆసక్తికరంగా మారబోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News