లఖింపూర్ ఘటనపై సుప్రీంలో విచారణ.. మంత్రి రాజీనామాకు కాంగ్రెస్ డిమాండ్..

ఉత్తర ప్రదేశ్‌ లఖింపుర్‌ ఖేరిలో జరిగిన ఘటనపై సుప్రీంకోర్టు విచారణ మొదలు పెట్టింది. ఈ ఘటనలో ఎంతమందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు, ఎంతమందిని అరెస్టు చేశారంటూ యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్టేటస్ రిపోర్ట్‌ సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతు లవ్‌ ప్రీత్‌ సింగ్ తల్లికి మెరుగైన వైద్యం అందించాలని యూపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ దుర్ఘటనపై దర్యాప్తుకోసం సిట్‌ తో పాటు న్యాయ కమిషన్‌ కూడా […]

Advertisement
Update:2021-10-07 12:16 IST

ఉత్తర ప్రదేశ్‌ లఖింపుర్‌ ఖేరిలో జరిగిన ఘటనపై సుప్రీంకోర్టు విచారణ మొదలు పెట్టింది. ఈ ఘటనలో ఎంతమందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు, ఎంతమందిని అరెస్టు చేశారంటూ యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్టేటస్ రిపోర్ట్‌ సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతు లవ్‌ ప్రీత్‌ సింగ్ తల్లికి మెరుగైన వైద్యం అందించాలని యూపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. ఈ దుర్ఘటనపై దర్యాప్తుకోసం సిట్‌ తో పాటు న్యాయ కమిషన్‌ కూడా ఏర్పాటు చేసినట్లు యూపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది. శుక్రవారం ఆ నివేదికను సమర్పిస్తామని చెప్పింది. అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలోని కమిషన్ ఈ కేసుపై దర్యాప్తు జరపాల్సి ఉంది.

బాధితులకు పరిహారం..
లఖింపుర్ ఖేరి ఘటన మృతుల కుటుంబాలకు ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఒక్కో కుటుంబానికి రూ.45 లక్షల విలువైన చెక్కును ఇచ్చింది. మృతుల్లో నలుగురు రైతులు, ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, కారు డ్రైవర్, ఒక జర్నలిస్టు ఉన్నారు. ఎనిమిదిమంది కుటుంబాలకు చెక్కులు అందజేసినట్టు ప్రభుత్వం తెలిపింది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు ఈ దుర్ఘటనలో నలుగురు రైతులు, జర్నలిస్ట్ కుటుంబానికి మాత్రమే పరిహారం ఇస్తే బాగుండేదని, మిగతా ముగ్గురిలో ఒకరు కారు డ్రైవర్ కాగా, ఇద్దరు బీజేపీ కార్యకర్తలని.. ఆ ముగ్గురూ నిందితులని, వారి కుటుంబాలకు ఎందుకు పరిహారం ఇచ్చారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.

మంత్రి రాజీనామాకు డిమాండ్..
లఖింపుర్ ఖేరి ఘటనకు సంబంధించి కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాల్సిందేనని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో న్యాయం పొందడం ఒక హక్కు అని, న్యాయం లభించేవరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని అన్నారు. ఈ ఘటనలో నిష్పక్షపాత దర్యాప్తు జరగాలంటే కేంద్రమంత్రి రాజీనామా చేయాలని ఆమె అన్నారు.

Tags:    
Advertisement

Similar News