మోదీ బహుమతులు ఎవరికీ నచ్చలేదా..?

ప్రధాని మోదీకి వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతులను వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బుతో నమామి గంగే ప్రాజెక్ట్ కి నిధులు సమకూర్చాలని చూస్తోంది ప్రభుత్వం. ఈమేరకు మోదీ పుట్టినరోజైన సెప్టెంబర్ 17నుంచి కొన్ని వస్తువులకు ఈ-ఆక్షన్ నిర్వహించింది. అయితే ఇప్పటి వరకూ 162 వస్తువులకు ఒక్కటంటే ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడం విశేషం. ప్రధాని తల్లితో కలసి ఉన్న ఫొటో కూడా.. ప్రధానికి వచ్చిన బహుమతులంటే అందరికీ ఆసక్తే. గతంలో వేలం వేస్తే వేలం […]

Advertisement
Update:2021-10-07 03:12 IST

ప్రధాని మోదీకి వివిధ సందర్భాల్లో వచ్చిన బహుమతులను వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బుతో నమామి గంగే ప్రాజెక్ట్ కి నిధులు సమకూర్చాలని చూస్తోంది ప్రభుత్వం. ఈమేరకు మోదీ పుట్టినరోజైన సెప్టెంబర్ 17నుంచి కొన్ని వస్తువులకు ఈ-ఆక్షన్ నిర్వహించింది. అయితే ఇప్పటి వరకూ 162 వస్తువులకు ఒక్కటంటే ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడం విశేషం.

ప్రధాని తల్లితో కలసి ఉన్న ఫొటో కూడా..
ప్రధానికి వచ్చిన బహుమతులంటే అందరికీ ఆసక్తే. గతంలో వేలం వేస్తే వేలం వెర్రిగా జనాలు ఎగబడేవారు. కానీ ఈ దఫా మాత్రం 162 వస్తువులను ఎవరూ చెయ్యెత్తి క్లిక్ చేయలేదు, వాటిని కోరుకోలేదు. వీటిలో టోక్యోలో ప్రధానికి బహూకరించిన ఓ కండువా, బాక్సర్ ‘లవ్లీనా’ ప్రధానికి బహూకరించిన బాక్సింగ్ గ్లౌస్ లు, భారత పురుషుల, మహిళల హాకీ టీమ్ లు సంతకాలు చేసి ఉన్న ‘హాకీ స్టిక్’ ని ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రధాని నరేంద్రమోదీ తల్లితో కలసి దిగిన ఫొటోపై కూడా ఎవరూ ఆసక్తి చూపలేదు. నమో నమో అంటూ జపం చేసే భక్తులంతా ఈ ఆక్షన్ కి ఎందుకు దూరంగా ఉన్నారనే విషయం అర్థం కావడంలేదు. గతంలో ప్రధాని బహుమతులంటే జనాల్లో బాగా క్రేజ్ ఉండేది. ఆయన వాడిన ‘కోటు’, ఆయన పెట్టిన ‘హ్యాటు’.. అన్నిటినీ పోటాపోటీగా సొంతం చేసుకునేవారు. ఆమధ్య ప్రధాని కోటుని కొన్న ఓ వ్యక్తి.. దాన్ని మ్యూజియంలో దాచినట్టు భద్రంగా పెట్టుకున్నారు. అలాంటివారంతా ఈసారి వేలంలో పాల్గొనలేదు.

వేలంలో అత్యథిక ధర వీటికే..
నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో వేసిన ‘జావెలిన్’ కి కోటి రూపాయలను వెబ్ సైట్ కోట్ చేయగా కోటీ యాభై వేల రూపాయలకు రెండు బిడ్లు దాఖలు కావడం విశేషం. మరో ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు ‘షటిల్ రాకెట్’ ను 80లక్షలకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నారు. మోదీ-ట్రంప్ కలసి ఉన్న ఫొటోకి మూడున్నర లక్షలు ఖరీదు కట్టారు మరో అభిమాని. ఇలా కొన్ని వస్తువులు హాట్ కేకుల్లా అమ్ముడైపోయినా.. ఈ దఫా 162వస్తువులు మాత్రం వేలంలో మిగిలిపోవడం అధికార వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది.

Tags:    
Advertisement

Similar News