బెంగాల్ ఆదాయం అదుర్స్.. మోదీపై సెటైర్స్..
కరోనా కష్టకాలంలోనూ పశ్చిమబెంగాల్ ఆర్థికాభివృద్ధిలో ముందుకి దూసుకెళ్లింది. రాష్ట్ర జీఎస్డీపీ 13.7లక్షల కోట్ల రూపాయలు దాటింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి నెట్ పర్ క్యాపిటా ఇన్ కమ్ లో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. బెంగాల్ ఆదాయం 7.16 శాతం పెరగగా, అదే సమయంలో భారత జాతీయ ఆదాయం 3.99 శాతం తగ్గడం మరో కీలక అంశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఈ గణాంకాలతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు కేంద్రంపై విమర్శలు […]
కరోనా కష్టకాలంలోనూ పశ్చిమబెంగాల్ ఆర్థికాభివృద్ధిలో ముందుకి దూసుకెళ్లింది. రాష్ట్ర జీఎస్డీపీ 13.7లక్షల కోట్ల రూపాయలు దాటింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి నెట్ పర్ క్యాపిటా ఇన్ కమ్ లో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. బెంగాల్ ఆదాయం 7.16 శాతం పెరగగా, అదే సమయంలో భారత జాతీయ ఆదాయం 3.99 శాతం తగ్గడం మరో కీలక అంశం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ఈ గణాంకాలతో తృణమూల్ కాంగ్రెస్ నేతలు కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మమత హయాంలో వెస్ట్ బెంగాల్ అభివృద్ధిలో దూసుకుపోతోందని అన్నారు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా. చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమస్యలను పరిష్కరించడంలో మమత సర్కారు చొరవ చూపించిందని దాని ఫలితమే ఈ ఆర్థిక పురోగమనం అని తెలిపారాయన.
మోదీపై సెటైర్లు..
మోదీ మార్కు అభివృద్ధి అంటూ బీజేపీ చేసుకుంటున్న ప్రచారాన్ని ఆర్బీఐ విడుదల చేసిన తాజా గణాంకాలతో తిప్పి కొట్టారు తృణమూల్ నేతలు. ఇతర రాష్ట్రాలన్నీ బీజేపీని ఆదర్శంగా తీసుకోవాలని, దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయంపై కేంద్రం కూడా బెంగాల్ ని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. ఇక జీఎస్డీపీ 10లక్షల కోట్ల రూపాయలు దాటిన రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ తోపాటు, తమిళనాడు కూడా ఉంది. బీహార్ లాంటి రాష్ట్రాల ఆదాయం కేవలం 7.6 లక్షల కోట్లు ఉంటే.. బెంగాల్ దాదాపుగా దానికి రెట్టింపు స్థాయిలో ఆర్జించడం విశేషం.