పండుగ సీజన్ లో జాగ్రత్త

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ధర్డ్ వేవ్ వస్తుందన్న భయం ఉన్నప్పటికీ అలాంటి సూచనలేవీ కనిపించకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రాబోయే పండుగల సీజన్ లో జాగ్రత్తగా లేకపోతే థర్డ్ వేవ్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కరోనా కేసులు అమాంతం పెరగడానికి, థర్డ్ వేవ్ ముంచుకురావడానికి పెద్దగా సమయమేమీ పట్టదని, ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందని ప్రభుత్వం సూచిస్తోంది. రాబోయే అక్టోబర్, నవంబర్‌ నెలలే అత్యంత కీలకమని కోవిడ్ టాస్క్ […]

Advertisement
Update:2021-09-17 06:27 IST

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ధర్డ్ వేవ్ వస్తుందన్న భయం ఉన్నప్పటికీ అలాంటి సూచనలేవీ కనిపించకపోవడంతో జనాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే రాబోయే పండుగల సీజన్ లో జాగ్రత్తగా లేకపోతే థర్డ్ వేవ్ ను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

కరోనా కేసులు అమాంతం పెరగడానికి, థర్డ్ వేవ్ ముంచుకురావడానికి పెద్దగా సమయమేమీ పట్టదని, ఉన్నట్టుండి కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందని ప్రభుత్వం సూచిస్తోంది. రాబోయే అక్టోబర్, నవంబర్‌ నెలలే అత్యంత కీలకమని కోవిడ్ టాస్క్ ఫోర్స్ చెప్తోంది.

ఇదిలా ఉంటే దేశంలో దాదాపు 62 శాతం వయసుపైబడిన వాళ్లు సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ పూర్తి చేసుకున్నారు. దాదాపు 20శాతం మందికి రెండు డోసులు పంపిణీ పూర్తయింది. దేశంలోని 32 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10% కన్నా ఎక్కువ ఉంది. అలాగే దేశంలో 34 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా ఉండగా.. 32 జిల్లాల్లో మాత్రం 5 నుంచి 10శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా మొదటి, రెండు వేవ్‌ల స్థాయిలో మూడో వేవ్‌ వచ్చే అవకాశాలు లేవని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజలందరూ రెండు డోసుల వ్యాక్సిన్ ను పూర్తి చేసుకోవాలని ప్రస్తుతానికి బూస్టర్‌ డోసు ఇవ్వాలన్న ప్రతిపాదనలేవీ కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని అధికారులు చెప్తున్నారు.

థర్డ్ వేవ్ రాకుండా జాగ్రత్త పడాలంటే పండగల సీజన్‌ లో ప్రజలు గుంపులుగా తిరగడాన్ని తగ్గించాలి. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలి. జ్వరాలు కూడా ఎక్కువగా విజృంభిస్తుండడంతో జనాలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది..

Tags:    
Advertisement

Similar News