పదేళ్ల తర్వాత హిట్ కొట్టాడంట
తాజాగా థియేటర్లలోకొచ్చిన సీటీమార్ సినిమా మంచి ఆక్యుపెన్సీ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా బి, సి సెంటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది మీడియాతో మాట్లాడాడు. పదేళ్ల తర్వాత సీటీమార్ రూపంలో తనకు మంచి హిట్ దొరికిందని సంతోషం వ్యక్తంచేశాడు. “నాకు గత పదేళ్లలో ఇంత పెద్ద హిట్ రాలేదు. ఈ సినిమా గోపీచంద్ ఫ్యాన్స్ దాహం తీర్చింది. […]
తాజాగా థియేటర్లలోకొచ్చిన సీటీమార్ సినిమా మంచి ఆక్యుపెన్సీ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా బి, సి సెంటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది మీడియాతో మాట్లాడాడు. పదేళ్ల తర్వాత సీటీమార్ రూపంలో తనకు మంచి హిట్ దొరికిందని సంతోషం వ్యక్తంచేశాడు.
“నాకు గత పదేళ్లలో ఇంత పెద్ద హిట్ రాలేదు. ఈ సినిమా గోపీచంద్ ఫ్యాన్స్ దాహం తీర్చింది. ఏ డైరెక్టర్‌కు అయినా ఓ హీరో, అతడి ఫ్యాన్స్ గర్వంగా ఫీలయ్యే సినిమా చేస్తే అంతకుమించి ఆనందం ఉండదు. నేను ఇప్పుడు అలాంటి హ్యాపీ మూడ్‌లోనే ఉన్నాను.”
ఈ సందర్భంగా సీటీమార్ క్లైమాక్స్ పై కూడా స్పందించాడు సంపత్ నింది. కేవలం క్లైమాక్స్ పార్ట్ ఎడిటింగ్
చేయడానికి తనకు 20 రోజులు పట్టిందంటున్నాడు.
“ఈ సినిమా క్లైమాక్స్ ఎడిట్ చేయడానికి 20 రోజులు తీసుకున్నాను. క్లైమాక్స్‌ను రెండు భాగాలుగా తీశాను.
దాన్ని మిక్స్ చేసి ప్రేక్షకులు మెప్పించేలా ఎడిట్ చేయడానికి చాలా కష్టపడ్డాం. ఇప్పుడొస్తున్న రెస్పాన్స్
చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది.”
ప్రస్తుతం సీటీమార్ సినిమా బి, సి సెంటర్లలో బాగా ఆడుతుంది. ఈ సినిమాకు మొదటి రోజు 5 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.