టీకా లభ్యత పెరిగితే గ్యాప్ తగ్గించేస్తారా..?

భారత్ లో పంపిణీ చేస్తున్న రెండు డోసుల టీకాల మధ్య ఎంత వ్యవధి ఉండాలనేది మొదటినుంచీ చర్చనీయాంశంగానే ఉంది. ఓ దశలో టీకా లభ్యత తక్కువగా ఉన్న సందర్భంలో అనివార్యంగా టీకా మొదటి డోసు, రెండో డోసు మధ్య గ్యాప్ బాగా పెంచేసింది కేంద్రం. గతంలో నెలరోజుల గ్యాప్ లో టీకా రెండు డోసులు వేయించుకోవాలనే నిబంధన ఉండేది. కోవాక్సిన్ అయినా, కోవిషీల్డ్ అయినా ఒకటే పద్ధతి. ఆ తర్వాత కోవిషీల్డ్ విషయంలో కేంద్రం ఈ నిబంధనలు […]

Advertisement
Update:2021-08-27 03:18 IST

భారత్ లో పంపిణీ చేస్తున్న రెండు డోసుల టీకాల మధ్య ఎంత వ్యవధి ఉండాలనేది మొదటినుంచీ చర్చనీయాంశంగానే ఉంది. ఓ దశలో టీకా లభ్యత తక్కువగా ఉన్న సందర్భంలో అనివార్యంగా టీకా మొదటి డోసు, రెండో డోసు మధ్య గ్యాప్ బాగా పెంచేసింది కేంద్రం. గతంలో నెలరోజుల గ్యాప్ లో టీకా రెండు డోసులు వేయించుకోవాలనే నిబంధన ఉండేది. కోవాక్సిన్ అయినా, కోవిషీల్డ్ అయినా ఒకటే పద్ధతి. ఆ తర్వాత కోవిషీల్డ్ విషయంలో కేంద్రం ఈ నిబంధనలు రెండుసార్లు మార్చింది. నాలుగు వారాల వ్యవధి ఆ తర్వాత 12వారాలయింది, మరోసారి 16వారాల వరకు పెరిగింది. టీకా సమర్థంగా పనిచేయడానికి ఆమాత్రం గ్యాప్ కావాలని సర్ది చెప్పుకుంది. దేశంలో వ్యాక్సిన్‌ కొరత కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరిగినా, వాటిని ఖండించింది కేంద్రం. డోసుల మధ్య గడువు పెంచడం వల్ల ఎక్కువ యాంటీబాడీలు వృద్ధి చెందుతున్నాయని కోవిడ్‌ వర్కింగ్‌ గ్రూపు ఛైర్మన్‌ ఆరోరా గతంలో పేర్కొన్నారు.

ఇప్పుడు యాంటీబాడీల అవసరం లేదా..?
వ్యాక్సిన్ మధ్య గ్యాప్ పెంచడంలో గతంలో బ్రిటన్ ని నమూనాగా తీసుకున్నట్టు చెప్పింది కేంద్రం. అయితే అక్కడ కూడా వ్యాక్సిన్ మధ్య గ్యాప్ తగ్గించి మూడు నెలలు కావస్తోంది. ఇప్పుడు భారత్ లో కూడా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య గ్యాప్ తగ్గించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. 12 నుంచి 16వారాలుగా ఉన్న వ్యవధిని.. మళ్లీ 6వారాలకు తగ్గిస్తారని అంటున్నారు. ఈ అంశంపై నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) నిపుణులతో ప్రభుత్వం చర్చిస్తోంది.

ప్రస్తుతం భారత్ లో టీకా లభ్యత ఆశించిన స్థాయిలో ఉంది, మరోవైపు కొత్త టీకాలకు కూడా అనుమతులొచ్చేశాయి. ఏడాది చివరిలోగా భారత్ లో 18 ఏళ్లు పైబడినవారందరికీ టీకాలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. అందుకే ఇప్పుడు డోసుల మధ్య వ్యవధి తగ్గించేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే ఈ వ్యవధి తగ్గింపుకి కారణం కొత్త వేరియంట్ల ప్రభావం అని చెబుతోంది కేంద్రం. అందుకే పునఃసమీక్ష చేస్తున్నట్టు ప్రకటించింది.

Tags:    
Advertisement

Similar News