మహారాష్ట్రలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి అరెస్ట్..

శివసేన వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం తారా స్థాయికి చేరి చివరకు కేంద్ర మంత్రి అరెస్ట్ కి దారి తీసింది. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెప్ప కొట్టేవాడినంటూ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ముంబైలో బీజేపీ కార్యాలయాలపై శివసేన దాడికి తెగబడింది. కార్యకర్తల మధ్య కర్రల యుద్ధం జరిగింది. ఈరోజు కొంకణ్‌ లో జన్‌ ఆశీర్వాద్‌ ర్యాలీలో పాల్గొన్న రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. […]

Advertisement
Update:2021-08-24 11:28 IST

శివసేన వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం తారా స్థాయికి చేరి చివరకు కేంద్ర మంత్రి అరెస్ట్ కి దారి తీసింది. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను చెంపదెప్ప కొట్టేవాడినంటూ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ముంబైలో బీజేపీ కార్యాలయాలపై శివసేన దాడికి తెగబడింది. కార్యకర్తల మధ్య కర్రల యుద్ధం జరిగింది. ఈరోజు కొంకణ్‌ లో జన్‌ ఆశీర్వాద్‌ ర్యాలీలో పాల్గొన్న రాణేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ ని ముందే ఊహించి రత్నగిరి కోర్టులో నారాయణ్‌ రాణే ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా అది రద్దయింది. బెయిల్‌ పిటిషన్‌ రద్దయిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు రాణేను అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.

అసలేం జరిగింది..?
మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేకు స్వాతంత్రం వ‌చ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియ‌ద‌ని కేంద్రమంత్రి నారాయ‌ణ్ రాణే ఇటీవల విమ‌ర్శించారు. స్వాతంత్ర దినోత్స‌వ సంద‌ర్భంగా ఉద్ధ‌వ్ చేసిన ప్రసంగాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది ఎన్నో స్వాతంత్ర దినోత్సవం అంటూ ఉద్ధవ్ పక్కనే ఉన్నవారిని అడిగారని, తానే అక్కడ ఉంటే ఉద్ధవ్ చెంప ప‌గల‌గొట్టేవాడిన‌ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారాయణ్ రాణే. ఉద్ధ‌వ్‌ కు స్వాతంత్రం వ‌చ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియ‌క‌పోవ‌డం సిగ్గుచేట‌న్నారు.

నారాయ‌ణ్ రాణే వ్యాఖ్య‌ల‌ను శివసేన తీవ్రంగా ఖండించింది. శివ‌సేన కార్య‌క‌ర్త‌లు ఆయ‌న ఇంటిని ముట్టడించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కేంద్ర మంత్రికి మద్దతుగా తరలి వచ్చారు. ఓ దశలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ముంబైలో ఇరు వర్గాలు చాలా చోట్ల కర్రల యుద్ధానికి దిగాయి. ఈ క్రమంలో ఈరోజు ఉదయాన్నుంచి నాటకీయ పరిణామాలు జరిగాయి. నారాయణ్ రాణేను అరెస్ట్ చేయబోతున్నట్టు నాసిక్ పోలీస్ కమిషనర్ పాండే ప్రకటించిన తర్వాత ముంబై హైకోర్ట్ లో రాణే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్‌ పై విచారణ జరపలేమని ముంబై హైకోర్టు తెలిపింది. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాల్లో 4 ఎఫ్‌ఐఆర్‌ లు నమోదయ్యాయి. ప్రస్తుతం వీటిపై విచారణ కొనసాగుతోంది. గతంలో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ్ రాణే.. ఇటీవల జరిగిన కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Tags:    
Advertisement

Similar News