భారత్ లో బూస్టర్ డోస్ అవసరమే.. కానీ..!

భారత్ లో వ్యాక్సినేషన్ గణాంకాలు 50కోట్లు దాటినా.. డబుల్ డోస్ టీకా తీసుకున్నవారి సంఖ్య అందులో సగం కూడా లేదనేది వాస్తవం. అయితే కేంద్రం మాత్రం అసలు లెక్కలు చెప్పకుండా.. ఎన్ని డోసుల టీకా పంపిణీ చేశామనేది మాత్రమే ఘనంగా చెప్పుకుంటోంది. వృథా అయిపోయిన టీకాల సంఖ్య కూడా ఇందులోనే కలసి ఉండటం విశేషం. వ్యాక్సినేషన్ ఇంకా పూర్తికాని భారత్ లో బూస్టర్ డోస్ గురించి చర్చ అనవసరం. కానీ బూస్టర్ డోస్ పై ప్రజల్లో ఆశలు […]

Advertisement
Update:2021-08-22 08:24 IST

భారత్ లో వ్యాక్సినేషన్ గణాంకాలు 50కోట్లు దాటినా.. డబుల్ డోస్ టీకా తీసుకున్నవారి సంఖ్య అందులో సగం కూడా లేదనేది వాస్తవం. అయితే కేంద్రం మాత్రం అసలు లెక్కలు చెప్పకుండా.. ఎన్ని డోసుల టీకా పంపిణీ చేశామనేది మాత్రమే ఘనంగా చెప్పుకుంటోంది. వృథా అయిపోయిన టీకాల సంఖ్య కూడా ఇందులోనే కలసి ఉండటం విశేషం. వ్యాక్సినేషన్ ఇంకా పూర్తికాని భారత్ లో బూస్టర్ డోస్ గురించి చర్చ అనవసరం. కానీ బూస్టర్ డోస్ పై ప్రజల్లో ఆశలు రేకెత్తించే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. భారత్ లో బూస్టర్ డోస్ ఏదో ఒక సమయంలో అవసరం కావొచ్చని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.

మూడో డోస్ నే బూస్టర్ అనుకోవాలా.?
ప్రస్తుతం భారత్ లో రెండు డోస్ ల టీకా అందుబాటులో ఉంది. మరి బూస్టర్ డోస్ అంటే ఏంటి.. విదేశాల్లో అయితే రెండు డోసులకు మరో డోస్ అదనంగా ఇవ్వడాన్నే బూస్టర్ డోస్ గా పరిగణిస్తున్నారు. అమెరికా, యూకే, ఇజ్రాయెల్ లో ఇదే జరుగుతోంది. కానీ బూస్టర్ అంటే మూడో డోస్ కావొచ్చు లేదా మరో కొత్త టీకా కావొచ్చు అని చెబుతున్నారు రణదీప్ గులేరియా. భారత్ లో ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలకు బూస్టర్ డోస్ కలపాలా, లేదా కొత్తగా తయారు చేయాలా అనే విషయంపై పరిశోధనలు జరుగుతున్నట్టు చెప్పారు. భారత్ లో ఇది ఎంతవరకు, ఎంతమందికి అవసరం అనే విషయంపై కూడా అధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు.

భారత్‌ లో బూస్టర్‌ డోస్‌ అవసరమని చెప్పడానికి ప్రస్తుతం తమ వద్ద తగినంత డేటా లేదని, వ్యాక్సిన్లు అందించే రక్షణపై పూర్తి డేటా ఉండాలన్నారు రణదీప్ గులేరియా. ఈ ఏడాది చివరినాటికి దీనికి అవసరమైన డేటా అందుబాటులో ఉంటుందని చెప్పారు. మూడో మోతాదుతో అధిక రక్షణ లభిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నట్టు చెప్పారు ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా.

Tags:    
Advertisement

Similar News