మూడో అడుగు కేసీఆర్ తలపై.. విమర్శల డోస్ పెంచిన రేవంత్..

తెలంగాణ పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి.. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లిలో జరిగిన తొలిసభలోనే కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రేవంత్.. రావిల్యాలలో జరిగిన మలి సభలో విమర్శల డోస్ మరింత పెంచారు. ఇంద్రవెల్లిలో తొలి అడుగు, రావిల్యాలలో మలి అడుగు, మూడో అడుగు నేరుగా కేసీఆర్ నెత్తిపై పెడతామని అన్నారు. కేటీఆర్ సహా టీఆర్ఎస్ నాయకులందరిపై పేరు […]

Advertisement
Update:2021-08-19 03:06 IST

తెలంగాణ పీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి.. దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇంద్రవెల్లిలో జరిగిన తొలిసభలోనే కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన రేవంత్.. రావిల్యాలలో జరిగిన మలి సభలో విమర్శల డోస్ మరింత పెంచారు. ఇంద్రవెల్లిలో తొలి అడుగు, రావిల్యాలలో మలి అడుగు, మూడో అడుగు నేరుగా కేసీఆర్ నెత్తిపై పెడతామని అన్నారు. కేటీఆర్ సహా టీఆర్ఎస్ నాయకులందరిపై పేరు పేరునా సెటైర్లు వేశారు. ఓ దశలో అరే ఒరే అంటూ కాస్త ఘాటుగా, కేసీఆర్ కి దీటుగా మాట్లాడారు రేవంత్ రెడ్డి.

దళిత ఉద్యోగులు బయటకు వెళ్లిపోతున్నారు..
దళిత బంధు పథకం కింద ఇచ్చే రూ.10 లక్షలు ఎవరి భిక్ష కాదని, కేసీఆర్‌ ఆయన అయ్య జాగీరులోనుంచి ఏమీ ఇవ్వడంలేదని, అది దళితుల హక్కు అని అన్నారు రేవంత్ రెడ్డి. విద్య, ఉపాధి లేకుండా చేసి, కేవలం డబ్బులిస్తున్నారని, కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేసిన పాఠశాలలు, కాలేజీలు లేకుండా చేస్తున్నారని, తమ పార్టీ నేతలకు యూనివర్శిటీలు కట్టబెట్టి పేదలకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దళితులపై కేసీఆర్ కి నిజమైన ప్రేమే ఉంటే.. ఆయన పాలనలో మురళి, ప్రవీణ్ కుమార్ వంటి దళిత ఆఫీసర్లు రాజీనామాలు చేసి ఎందుకు బయటకెళ్లిపోయారో చెప్పాలన్నారు. ఉన్నత వర్గాలకు చెందిన గవర్నర్లు, రాష్ట్రపతులు వస్తే సాష్టాంగ నమస్కారం చేసే అలవాటున్న కేసీఆర్, ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కి మాత్రం కేవలం నమస్కారం చేసి సరిపెట్టారని విమర్శించారు. బొజ్జా రాహుల్ ని సీఎం పేషీలోకి తీసుకున్నంత మాత్రాన కేసీఆర్ చేసిన పాపాలు తుడిచిపెట్టుకు పోవని అన్నారు. చీఫ్ సెక్రటరీలుగా పనిచేసినవారి పదవీకాలం పెంచే కేసీఆర్, దళిత అధికారులకు మాత్రం ఆ అవకాశం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.

అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని, మంత్రిని అయ్యానంటూ కేటీఆర్ చెప్పుకోవడం హాస్యాస్పదం అని సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. సిరిసిల్లలో మహేందర్ రెడ్డికి వెన్నుపోటు పొడిచి, కొడుకు కేటీఆర్ కి తండ్రి కేసీఆర్ రాజకీయ జీవితం ఇచ్చారని అన్నారు. నెల రోజుల నుంచి కేసీఆర్‌ కాలు కాలిన పిల్లిలా.. కల్లు తాగిన కోతిలా గంతులు వేస్తున్నాడని చెప్పారు.

బలిదానాలు ఎవరివి..? పదవులు ఎవరికి..?
తెలంగాణ కోసం ఆత్మాహుతులు చేసుకుంది ఎవరో, తెలంగాణ వచ్చాక పదవులు ఎవరికి వచ్చాయో అందరికీ తెలుసన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్‌ కు ముఖ్యమంత్రి పదవి, ఆయన కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు, కూతురికి ఎమ్మెల్సీ, బంధువులకి రాజ్యసభ.. ఇలా కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని అన్నారు. రాసుకోవడానికి పేపరు, చూసుకోవడానికి టీవీ, వ్యాపారాలు చేసుకోడానికి లక్షలకోట్లు, ఫామ్ హౌజ్ లు కేసీఆర్ కి వచ్చాయని, అమరుల కుటుంబాలకు ఏమి వచ్చాయో ప్రజలు ఆలోచంచాలని కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ కి గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News