యడ్యూరప్ప తిరుగుబాటు మొదలైనట్టేనా..?

యడ్యూరప్ప అలిగారు, తన కొడుక్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని, కనీసం కేబినెట్ బెర్త్ అయినా దొరుకుతుందని ఆశించిన ఆయన కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అన్యాయంగా తనను సీఎం కుర్చీనుంచి దించేశారనే ఆవేదన ఆయనలో ఇంకా ఉంది. కనీసం కొడుక్కి డిప్యూటీసీఎం పదవి ఇచ్చినా ఆయన సంతృప్తిపడేవారు కానీ అది కూడా జరక్కపోయే సరికి తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తాజాగా ఆయన తన అసంతృప్తిని సీఎం ముందుంచారు. తనను కేవలం […]

Advertisement
Update:2021-08-09 04:47 IST

యడ్యూరప్ప అలిగారు, తన కొడుక్కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని, కనీసం కేబినెట్ బెర్త్ అయినా దొరుకుతుందని ఆశించిన ఆయన కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై తీరుతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అన్యాయంగా తనను సీఎం కుర్చీనుంచి దించేశారనే ఆవేదన ఆయనలో ఇంకా ఉంది. కనీసం కొడుక్కి డిప్యూటీసీఎం పదవి ఇచ్చినా ఆయన సంతృప్తిపడేవారు కానీ అది కూడా జరక్కపోయే సరికి తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తాజాగా ఆయన తన అసంతృప్తిని సీఎం ముందుంచారు. తనను కేవలం మాజీ ముఖ్యమంత్రిగా, ఒక ఎమ్మెల్యేగానే గుర్తించాలని, కేబినెట్ ర్యాంక్ వద్దని తేల్చి చెప్పారు.

యడ్యూరప్ప సూచనతోనే కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేరు తెరపైకి వచ్చిందని అంటారు. అయితే అధిష్టానం అన్నీ ఆలోచించే బొమ్మైని సెలక్ట్ చేసుకుందని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. ఎంతమాత్రం యడ్డీ శిష్యుడైనా బొమ్మై ముందుగా అధిష్టానానికి బద్ధుడు. అందుకే తన హయాంలో డిప్యూటీసీఎంలే లేకుండా చేశారు. వర్గాలు లేకుండా చూసుకున్నారు. గురుభక్తి అనుకోండి, లేదా అధిష్టానం సూచన అనుకోండి.. మంత్రి వర్గ విస్తరణతోపాటు.. మాజీ సీఎం యడ్యూరప్పకు కేబినెట్ ర్యాంక్ ఇస్త ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మంత్రి పదవి లేకుండా కేబినెట్ మంత్రులకు ఉన్న హోదా, సౌకర్యాలు అన్నీ కల్పించారు. కానీ యడ్యూరప్ప దీనితో సంతోషపడలేదు.

తన కొడుక్కి మంత్రి పదవి ఎగరగొట్టి, తనకు కేబినెట్ ర్యాంక్ ఇవ్వడంపై యడ్యూరప్ప తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని తెలుస్తోంది. అందుకే ఆయన నేరుగా సీఎం బొమ్మైకి లేఖ రాశారు. ప్రభుత్వం కేటాయించిన కేబినెట్‌ హోదా తనకు వద్దంటూ ఆయన లేఖ రాయడం ఇప్పుడు కర్నాటక రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. తాను అసంతృప్తిలో ఉన్నాననే సమాచారాన్ని నేరుగా అధిష్టానానికి ఇలా చేరవేశారు యడ్యూరప్ప.

Tags:    
Advertisement

Similar News