భారత్‌కు మరో రెండు వ్యాక్సిన్లు
130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అంత సులభతరం కాదు. ఇప్పటికే దేశీయంగా రెండు కంపెనీలు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన భారత్‌బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ కోవాగ్జిన్.. ఇక సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఆశించిన స్థాయిలో వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయడం లేదు. దీంతో 100 శాతం వ్యాక్సినేషన్ ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి […]
130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అంత సులభతరం కాదు. ఇప్పటికే దేశీయంగా రెండు కంపెనీలు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన భారత్‌బయోటెక్ కంపెనీ వ్యాక్సిన్ కోవాగ్జిన్.. ఇక సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఆశించిన స్థాయిలో వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేయడం లేదు. దీంతో 100 శాతం వ్యాక్సినేషన్ ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పరిస్థితి లేదు.
మరోవైపు థర్డ్‌వేవ్ హెచ్చరికలు.. కొత్త వేరియంట్లు.. మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌లోకి మరో రెండు వ్యాక్సిన్లు రాబోతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోసు వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌కు వివిధ దేశాలు అనుమతి ఇచ్చాయి. ప్రస్తుతం ఈ కంపెనీ మనదేశంలో అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
హైదరాబాద్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ సహకారంతో తాము భారత్‌లో పెద్ద ఎత్తున వ్యాక్సిన్ ఉత్పత్తి చేయబోతున్నామని సదరు కంపెనీ ప్రకటించింది. ఏప్రిల్ లోనే టీకా ట్రయల్స్ కు సంబంధించి అనుమతులు కోరగా.. తాజాగా వ్యాక్సిన్ వినియోగంపై దరఖాస్తు చేయడం, అనుమతి లభించడం జరిగింది.
సీరం ఇన్‌స్టిట్యూట్ కూడా కొవోవ్యాక్స్‌కు అత్యవసర వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అమెరికా కంపెనీకి చెందిన నొవావ్యాక్స్ వ్యాక్సిన్‌ను ఇండియాలో కొవోవ్యాక్స్‌గా ఉత్పత్తి చేయనుంది. నొవావ్యాక్స్ ఎఫికసీ రేట్ 93 శాతంగా ఉన్నట్టు ఆ సంస్థ చెబుతోంది. సెప్టెంబర్ నాటికి కొవోవ్యాక్స్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని సీరం సంస్థ భావిస్తోంది. వివిధ వేరియంట్ల మీద ఈ వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని చెబుతోంది. జాన్సన్ అండ్ జాన్సన్, కొవోవ్యాక్స్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగే అవకాశం ఉంది.