ఈ​-రూపీని తీసుకొస్తున్న కేంద్రం.. ఇంతకీ ఏమిటిది?

కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా డిజిటల్​ లావాదేవీలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో డిజిటల్​ లావాదేవీలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే సోమవారం నరేంద్రమోదీ ఈ -రూపీని లాంచనంగా ప్రారంభించబోతున్నారు. అసలు ఈ రూపీ అంటే ఏమిటి? ఇది ఎలా వాడుకోవాలి? తదితర విషయాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్​లతో సంబంధం లేకుండా ఈ రూపీని వినియోగించుకోవచ్చని కేంద్రం అంటున్నది. ముఖ్యంగా ప్రభుత్వం అందించే సబ్సిడీలకు సంబంధించిన డబ్బులు ప్రస్తుతం నేరుగా రైతులకు […]

Advertisement
Update:2021-08-02 04:43 IST

కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా డిజిటల్​ లావాదేవీలు పెంచేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో డిజిటల్​ లావాదేవీలు ఊపందుకున్నాయి. ఇదిలా ఉంటే సోమవారం నరేంద్రమోదీ ఈ -రూపీని లాంచనంగా ప్రారంభించబోతున్నారు. అసలు ఈ రూపీ అంటే ఏమిటి? ఇది ఎలా వాడుకోవాలి? తదితర విషయాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

బ్యాంకు ఖాతాలు, కార్డులు, యాప్​లతో సంబంధం లేకుండా ఈ రూపీని వినియోగించుకోవచ్చని కేంద్రం అంటున్నది. ముఖ్యంగా ప్రభుత్వం అందించే సబ్సిడీలకు సంబంధించిన డబ్బులు ప్రస్తుతం నేరుగా రైతులకు అందుతున్నాయి. అయితే ఇక నుంచి వాటిని ఈ రూపీకి ఇవ్వబోతారని సమాచారం.

దీని ద్వారా ప్రభుత్వం అందజేసే సబ్సిడీ వృథా, దుర్వినియోగాన్ని అరికట్టవచ్చనేది కేంద్రం అభిప్రాయంగా తెలుస్తోంది. ఉదాహరణకు ఎరువుల డీలర్లు ప్రభుత్వ సబ్సిడీని తగ్గించి, బస్తాలను రైతులకు విక్రయిస్తున్నారు. ఇక నుంచి ఆ సబ్సిడీని నేరుగా రైతుల మొబైల్‌ ఫోన్లకు ఈ-రూపీ వోచర్ల రూపంలో పంపే అవకాశాలున్నాయి. వారు ఎరువుల డీలర్ల వద్ద వాటిని రిడీమ్‌ చేసుకుని, మిగతా మొత్తం నేరుగా లేదా ఈ-రూపీ వోచర్లను కొనుగోలు చేసి, చెల్లించొచ్చు.

ఈ రూపీ ఏ రూపంలో అందిస్తారు?
ఈ-రూపీ అనేది వినియోగదారుల మొబైల్‌ఫోన్‌కు క్యూఆర్‌ కోడ్‌ లేదా ఎస్సెమ్మెస్‌ స్ట్రింగ్‌ వోచర్‌ రూపంలో వస్తుంది. భారత జాతీయ చెల్లింపుల సాధికార సంస్థ(ఎన్‌పీసీఐ) ఈ విధానాన్ని రూపకల్పన చేసినట్టు సమాచారం.

ఈ-రూపీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య సాధికార సంస్థ సహకారం ఉంది. అయితే ఈ రూపీ వినియోగంపై ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రైతులలో చాలా మంది నిరక్ష్యరాస్యులే ఉంటారు. వారు ఈ రూపీని ఎలా ఉపయోగించుకోగలుతారన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News