భారత్ కు ప్రయాణాలు మూడేళ్లు నిషేధం..
సెకండ్ వేవ్ సమయంలో భారత్ ని హిట్ లిస్ట్ లో చేర్చి.. అక్కడినుంచి నిర్ణీత సమయంలో తమ దేశానికి రాలేని వారికి నో ఎంట్రీ అంటూ ఆస్ట్రేలియా ఆంక్షలు విధించింది. సరిగ్గా ఇప్పుదు సౌదీ అరేబియా కూడా అలాంటి ఆంక్షలే తెరపైకి తెచ్చింది. అయితే సౌదీ కండిషన్లు మరింత కఠినంగా ఉన్నాయి. రెడ్ లిస్ట్ పేరుతో సౌదీ విడుదల చేసిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. భారత్ ప్రయాణాలను మూడేళ్లపాటు రద్దు చేసింది సౌదీ. యూఏఈ, […]
సెకండ్ వేవ్ సమయంలో భారత్ ని హిట్ లిస్ట్ లో చేర్చి.. అక్కడినుంచి నిర్ణీత సమయంలో తమ దేశానికి రాలేని వారికి నో ఎంట్రీ అంటూ ఆస్ట్రేలియా ఆంక్షలు విధించింది. సరిగ్గా ఇప్పుదు సౌదీ అరేబియా కూడా అలాంటి ఆంక్షలే తెరపైకి తెచ్చింది. అయితే సౌదీ కండిషన్లు మరింత కఠినంగా ఉన్నాయి. రెడ్ లిస్ట్ పేరుతో సౌదీ విడుదల చేసిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది. భారత్ ప్రయాణాలను మూడేళ్లపాటు రద్దు చేసింది సౌదీ.
యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సోమాలియా, కాంగో, ఆఫ్గనిస్తాన్, వెనిజులా, బెలారస్, వియత్నాం దేశాలతో సహా.. భారత్ కు వెళ్లడాన్ని సౌదీ మూడేళ్లపాటు నిషేధించింది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం సౌదీలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. 11,136మంది కొవిడ్ తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొత్తం కేసులు 5,20,774కి చేరుకోగా కొవిడ్ మరణాల సంఖ్య 8,189గా ఉంది. దీంతో కరోనా కట్టడికోసం సౌదీ ఆంక్షలు కఠినతరం చేసింది.
ఆయా దేశాలకు వెళ్లి రావాలంటే కుదరదు..
భారత్ సహా రెడ్ లిస్ట్ లో ఉన్న దేశాలకు వెళ్లడాన్ని మూడేళ్లపాటు నిషేధించింది సౌదీ ప్రభుత్వం. ఆయా దేశాలనుంచి వచ్చేవారికి కూడా తమ దేశంలోకి నో ఎంట్రీ అని తేల్చి చెప్పింది. నేరుగా రావడమే కాదు, పక్క దేశాలకు వెళ్లి, అక్కడినుంచి రావడం కూడా నిషిద్ధం. అంటే దాదాపుగా రెడ్ లిస్ట్ లో ఉన్న దేశాలతో సౌదీ వాసులు ప్రయాణ సంబంధాలు పూర్తిగా తెంచేసుకోవాల్సిందేననమాట.
భారీ జరిమానాలు..
నిషేధిత జాబితాలో ఉన్న దేశాలకు వెళ్లి వచ్చేవారికి భారీ జరిమానాలు విధిస్తామని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది. ఆయా దేశాలకు వెళ్తే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టే పరిగణిస్తామని చెప్పింది. సౌదీ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.