ఏపీలో మళ్లీ లాక్ డౌన్ ఉంటుందా..?

దేశవ్యాప్తంగా దాదాపు 10 రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కనపడుతోంది. మరోవైపు సగటు పాజిటివిటీ రేటు కూడా తగ్గనంటోంది. ఇటు ఏపీలో కూడా కొన్ని జిల్లాల్లో పరిస్థితి చేయిదాటేలా కనిపిస్తోంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చర్యలు పాటిస్తున్నారు. గడచిన 24 గంటల్లో ఏపీలో 2,527 మందికి కొవిడ్ పాజిటివ్‌ గా తేలింది. 19 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు. తూర్పుగోదావరిలో పెరుగుతున్న కేసులు.. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు క్రమక్రమంగా […]

Advertisement
Update:2021-07-22 03:21 IST

దేశవ్యాప్తంగా దాదాపు 10 రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కనపడుతోంది. మరోవైపు సగటు పాజిటివిటీ రేటు కూడా తగ్గనంటోంది. ఇటు ఏపీలో కూడా కొన్ని జిల్లాల్లో పరిస్థితి చేయిదాటేలా కనిపిస్తోంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చర్యలు పాటిస్తున్నారు. గడచిన 24 గంటల్లో ఏపీలో 2,527 మందికి కొవిడ్ పాజిటివ్‌ గా తేలింది. 19 మంది కరోనా రోగులు మృత్యువాత పడ్డారు.

తూర్పుగోదావరిలో పెరుగుతున్న కేసులు..
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో అత్యథిక కేసులు నమోదవుతున్న జిల్లాల్లో తూర్పుగోదావరిది మొదటి స్థానం. రోజుకి కనీసం 500 కొత్త కేసులు బయటపడుతున్నాయి. గడచిన 20రోజుల్లో అక్కడ 10,944 కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ఫ్యూ వేళలు పొడిగించారు అధికారులు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పూర్తి స్థాయిలో కర్ఫ్యూ పాటిస్తున్నారు. మిగతా జిల్లాల్లో ఉదయం 6నుంచి రాత్రి 10వరకు కర్ఫ్యూ సడలింపులు ఉంటే.. తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరు, పి.గన్నవరం మండలాల్లో ఉదయం 6నుంచి మధ్యాహ్నం 2 వరకే సడలింపులు కొనసాగుతున్నాయి. జిల్లాల్లో హాట్ స్పాట్ లు గా మారిన మిగతా మండలాల్లో కూడా ఇదే తరహా ఆంక్షలు విధించేందుకు సమాయత్తమవుతున్నారు అధికారులు.

కావలి డివిజన్ లో ఆంక్షలు..
అటు నెల్లూరు జిల్లా కావలిలో కూడా కేసుల సంఖ్య తగ్గనంటుండే సరికి స్థానిక అధికారులతో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ సడలింపులుంటాయని స్పష్టం చేశారు. ఈమేరకు వ్యాపార వర్గాలను కూడా ఒప్పించారు అధికారులు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెద్ద చెరుకూరు, చిన్న చెరుకూరు గ్రామాల్లో ఒకేరోజు 100కేసులు వెలుగులోకి రావడంతో ఆందోళన మొదలైంది.

జిల్లా కేంద్రాలపై దృష్టి..
తెలంగాణలో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఆంక్షలు తీసివేసినా, ఏపీలో మాత్రం నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి కర్ఫ్యూని మరికొంతకాలం పొడిగించేందుకు కూడా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే పగటిపూట పెరుగుతున్న రద్దీ, జిల్లా కేంద్రాల్లో జోరుగా సాగుతున్న వ్యాపార కార్యకలాపాలు, ప్రజల్లో కొవిడ్ నిబంధనలపై అనాసక్తి.. వెరసి కేసుల సంఖ్యను పెంచుతున్నాయి. అటు ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి, ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి ఈ దశలో పలు జిల్లాల అధికారులు ముందుగానే అప్రమత్తం అయ్యారు. కర్ఫ్యూ వేళలను పొడిగించారు, కొవిడ్ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News