ఆర్ఆర్ఆర్ కోసం ప్రచార గీతం

మగధీర సినిమా గుర్తుందా.? ఆ సినిమా చివర్లో ఓ స్పెషల్ సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ లో యూనిట్ అంతా కలిసి డాన్స్ చేస్తారు. సరిగ్గా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలని నిర్ణయించాడు రాజమౌళి. అవును.. ఆర్ఆర్ఆర్ కోసం ప్రత్యేక ప్రచారం గీతాన్ని కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు కీరవాణి. ఆ సాంగ్ షూటింగ్ ను సోమవారం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఈ పాట షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఓ […]

Advertisement
Update:2021-07-17 14:52 IST

మగధీర సినిమా గుర్తుందా.? ఆ సినిమా చివర్లో ఓ స్పెషల్ సాంగ్ పెట్టారు. ఆ సాంగ్ లో యూనిట్ అంతా
కలిసి డాన్స్ చేస్తారు. సరిగ్గా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కోసం కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వాలని నిర్ణయించాడు
రాజమౌళి. అవును.. ఆర్ఆర్ఆర్ కోసం ప్రత్యేక ప్రచారం గీతాన్ని కంపోజ్ చేశాడు సంగీత దర్శకుడు
కీరవాణి. ఆ సాంగ్ షూటింగ్ ను సోమవారం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు.

ఈ పాట షూటింగ్ కోసం హైదరాబాద్ లో ఓ ప్రత్యేకమైన సెట్ రెడీ చేశారు. ఎన్టీఆర్-రామ్ చరణ్ తమ
రెండు చేతుల్ని కలిపిన స్టిల్ ను బేస్ చేసుకొని సెట్ రూపొందించారు. ఈ సెట్ కు సంబంధించిన
ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

3 రోజుల పాటు సాగనున్న ఈ సాంగ్ షూటింగ్ లో యూనిట్ లోని నటీనటులందరితో పాటు టెక్నీషియన్స్
కూడా కనిపించబోతున్నారు. ఈ పాట షూట్ పూర్తయిన తర్వాత, మరో పాట షూట్ కోసం యూరోప్
వెళ్లబోతోంది ఆర్ఆర్ఆర్ యూనిట్. అక్టోబర్ 13న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

Tags:    
Advertisement

Similar News