నాకు ఏ ఇబ్బందులూ లేవు.. తప్పుడు ప్రచారం ఆపండి..! ఎర్రన్న ఫైర్..!
మీడియా, సోషల్ మీడియాపై ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం కట్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలపై ఆర్. నారాయణ మూర్తి రైతన్న అనే ఓ సినిమాను తీశారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇటీవల నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. ఆర్.నారాయణ మూర్తి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సినిమాలు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయి. ఆర్. […]
మీడియా, సోషల్ మీడియాపై ప్రముఖ నటుడు ఆర్. నారాయణమూర్తి మండిపడ్డారు. తప్పుడు ప్రచారం కట్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలపై ఆర్. నారాయణ మూర్తి రైతన్న అనే ఓ సినిమాను తీశారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ఇటీవల నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. ఆర్.నారాయణ మూర్తి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సినిమాలు తీస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయి.
ఆర్. నారాయణమూర్తి ఆర్థికంగా చితికిపోయారని.. ఆయన అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నారని కథనాలు రాశాయి. దీంతో నారాయణమూర్తికి ఆయన అభిమానులు,స్నేహితులు వరుసగా ఫోన్లు చేశారట. విదేశాల్లో ఉంటున్న ఆయన అభిమానులు కూడా స్పందించి సాయం చేస్తాం.. అకౌంట్ నంబర్ ఇవ్వడంటూ ఫోన్లు చేశారట.
దీంతో ఆర్. నారాయణ మూర్తి స్పందించారు. ’ నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో లేను. నాకు ఎవరూ సాయం చేయాల్సిన అవసరం లేదు. సామాన్యుడిగా జీవించడం.. హైదరాబాద్‌కు దూరంగా పల్లె ప్రాంతంలో ఉండటం నా జీవన విధానం. నా మీద తప్పుడు ప్రచారం చేయకండి. ఒకవేళ నాకు ఏదైనా ఇబ్బంది వస్తే .. సాయం చేసేందుకు ఎంతో మంది సన్నిహితులు ఉన్నారు. ఆటోలో ప్రయాణించడం.. చిన్న చిన్న హోటల్లో బస చేయడం నా జీవన విధానంలో భాగం.
ప్రస్తుతం నేను హైదరాబాద్‌కు దూరంగా ఉంటున్నాను. అక్కడి నుంచి ప్రతిరోజు ప్రసాద్ ల్యాబ్‌కు వచ్చేందుకు రూ. 1000 ఖర్చు పెట్టుకొని.. ఆటోలో వస్తున్నాను. అంటే నాకు నెలకు సగటున రూ. 30,000 ఖర్చవుతుంది. ఈ డబ్బుతో నేను జూబ్లీహిల్స్‌లో అద్దె ఇంట్లో ఉండలేనా’ అంటూ ఆర్.నారాయణ మూర్తి అన్నారు. దయచేసి తన మీద దుష్ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కొన్ని యూట్యూబ్ చానల్స్, కొన్ని వెబ్సైట్లు తన మీద తప్పుడు ప్రచారం చేశాయని,ఇది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.