దగ్గుబాటి హీరో సైలెంట్ ఎంట్రీ

గ్రాండ్ గా జరగాల్సిన దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ చాలా సింపుల్ గా, సాదాసీదాగా జరిగిపోయింది. తేజ దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ సెట్స్ పైకొచ్చాడు అభిరామ్. నిన్నట్నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో కొనసాగుతోంది. ఓ పెద్ద కాంపౌండ్ నుంచి కొత్త హీరో వస్తే లాంఛింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. నాగచైతన్య, రామ్ చరణ్ నుంచి చాలామంది హీరోల డెబ్యూ ఘనంగా జరిగింది. కానీ అభిరామ్ డెబ్యూ మాత్రం సాదాసీదాగా జరిగిపోయింది. దీనికి చాలా కారణాలున్నాయి. […]

Advertisement
Update:2021-07-05 13:44 IST

గ్రాండ్ గా జరగాల్సిన దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ చాలా సింపుల్ గా, సాదాసీదాగా జరిగిపోయింది. తేజ
దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ సెట్స్ పైకొచ్చాడు అభిరామ్. నిన్నట్నుంచి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్
లో కొనసాగుతోంది.

ఓ పెద్ద కాంపౌండ్ నుంచి కొత్త హీరో వస్తే లాంఛింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. నాగచైతన్య,
రామ్ చరణ్ నుంచి చాలామంది హీరోల డెబ్యూ ఘనంగా జరిగింది. కానీ అభిరామ్ డెబ్యూ మాత్రం
సాదాసీదాగా జరిగిపోయింది. దీనికి చాలా కారణాలున్నాయి.

ప్రస్తుతం కరోనా కాలం నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో హంగామా చేయకూడదని సురేష్ బాబు
నిర్ణయించుకున్నారు. దీనికితోడు ఆమధ్య శ్రీరెడ్డి ఇష్యూతో అభిరామ్ బాగా బ్యాడ్ అయ్యాడు. ఇప్పటికీ
అభిరామ్ పేరు చెబితే, ఆ ఇష్యూనే చాలామందికి గుర్తొస్తుంది. దీనికితోడు ఎప్పటికప్పుడు అభిరామ్ ఎంట్రీ
లేట్ అవుతూ వస్తోంది. అందుకే ఈసారి సింపుల్ గా సెట్స్ పైకి వచ్చేశాడు రానా తమ్ముడు అభిరామ్.

Tags:    
Advertisement

Similar News