కరోనా కొత్త వేరియంట్ 'లాంబ్డా'.. డబ్ల్యూహెచ్ఓ ముందస్తు హెచ్చరికలు..

కొత్త వేరియంట్లతో కొవిడ్ వైరస్ బలం పెంచుకుంటూ పోతోందనడానికి డెల్టా ఉదంతమే పెద్ద ఉదాహరణ. ప్రస్తుతం డెల్టా ప్లస్ వేరియంట్ సామర్థ్యంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. డెల్టా కంటే డెల్టా ప్లస్ డేంజరా? కొత్త వేరియంట్ తో థర్డ్ వేవ్ ముప్పు వస్తుందా అనే అధ్యయనాలు జోరందుకున్నాయి. అయితే ఈలోగా ‘లాంబ్డా’ అనే మరో వేరియంట్ కొన్ని దేశాల్లో వెలుగు చూసింది. గతేడాదే దీని ఉనికి పసిగట్టినా.. ఇప్పుడిప్పుడే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో […]

Advertisement
Update:2021-06-28 02:25 IST

కొత్త వేరియంట్లతో కొవిడ్ వైరస్ బలం పెంచుకుంటూ పోతోందనడానికి డెల్టా ఉదంతమే పెద్ద ఉదాహరణ. ప్రస్తుతం డెల్టా ప్లస్ వేరియంట్ సామర్థ్యంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. డెల్టా కంటే డెల్టా ప్లస్ డేంజరా? కొత్త వేరియంట్ తో థర్డ్ వేవ్ ముప్పు వస్తుందా అనే అధ్యయనాలు జోరందుకున్నాయి. అయితే ఈలోగా ‘లాంబ్డా’ అనే మరో వేరియంట్ కొన్ని దేశాల్లో వెలుగు చూసింది. గతేడాదే దీని ఉనికి పసిగట్టినా.. ఇప్పుడిప్పుడే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ‘లాంబ్డా’ విస్తరిస్తోందని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (దృష్టిసారించాల్సిన వైరస్ రకం) గా ప్రకటించింది.

స్పైక్ ప్రొటీన్ లోని L-452-Q, F-490-S సహా పలు ఉత్పరివర్తనలతో ‘లాంబ్డా’ వేరియంట్ ఉత్పన్నమైందని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. బ్రిటన్ లోని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(PHE) కూడా దీనిపై పరిశోధనలు చేస్తోంది. పరిశోధనలో ఉన్న కరోనా రకంగా దీన్ని వర్గీకరించింది. బ్రిటన్ లో ఇప్పటి వరకూ 6 ‘లాంబ్డా’ వేరియంట్ కేసులు కనుగొన్నారు.

పెరులో పుట్టిన ‘లాంబ్డా’..
‘లాంబ్డా’ వేరియంట్ ని తొలుత పెరూలో గుర్తించారు. గతేడాది ఆగస్ట్ లో పెరూలో తొలి ‘లాంబ్డా’ కేసు నమోదైంది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్‌, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ఆయా దేశాల్లో డెల్టా వేరియంట్ తో కలసి ‘లాంబ్డా’ కూడా విస్తరించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పెరూలో ‘లాంబ్డా’ విజృంభణ పెరిగింది. అక్కడ కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 81 శాతం కొత్త వేరియంట్ ఉండటం గమనార్హం. గత 2 నెలల కాలంలో చిలీలో 32 శాతానికి పైగా ఈ తరహా కేసులు నమోదయ్యాయి.

పూర్తిస్థాయి పరిశోధనలు..
ఇప్పటి వరకు బయటపడిన కరోనా వేరియంట్ లలో డెల్టా బీభత్సమే ఎక్కువ. ప్రస్తుతం డెల్టా ప్లస్ పై పరిశోధనలు జరుగుతున్నాయి. ‘లాంబ్డా’పై కూడా ఇంకా ఓ స్థిరమైన నిర్ణయానికి రాలేదు శాస్త్రవేత్తలు. ఈ వేరియంట్‌ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్‌ వస్తుందనడానికి గానీ, ప్రస్తుత టీకాలను ఇది ఏమారుస్తుందనడానికి గానీ ఎలాంటి ఆధారాలు లేవని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ సంస్థ పేర్కొంది. అయితే దీని స్పైక్‌ ప్రొటీన్‌ లోని కొన్ని ఉత్పరివర్తనల వల్ల ఇది ఉద్ధృతంగా వ్యాపించే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News