జగమే తంత్రం మూవీ రివ్యూ

నటీనటులు : ధనుష్, ఐశ్వర్య లక్ష్మి, జేమ్స్ కస్మో, జోజు జార్జ్, కళయరాసన్ తదితరులు కెమెరామెన్ : శ్రేయాస్ కృష్ణ సంగీతం : సంతోష్ నారాయణ్ నిర్మాతలు : శశి కాంత్, చక్రవర్తి రామచంద్ర కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్ రేటింగ్ : 2.25/5 థియేటర్లలో సినిమాల్లేక, అన్నీ ఓటీటీలోనే వస్తున్న వేళ.. సినిమాలపై పెద్దగా ప్రచారం, చర్చ జరగడం లేదు. ఎంత పెద్ద సినిమా వచ్చినా బజ్ ఓ మోస్తరుగానే ఉంటోంది. అప్పుడెప్పుడో సూర్య […]

Advertisement
Update:2021-06-18 15:14 IST

నటీనటులు : ధనుష్, ఐశ్వర్య లక్ష్మి, జేమ్స్ కస్మో, జోజు జార్జ్, కళయరాసన్ తదితరులు
కెమెరామెన్ : శ్రేయాస్ కృష్ణ
సంగీతం : సంతోష్ నారాయణ్
నిర్మాతలు : శశి కాంత్, చక్రవర్తి రామచంద్ర
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : కార్తీక్ సుబ్బరాజ్
రేటింగ్ : 2.25/5

థియేటర్లలో సినిమాల్లేక, అన్నీ ఓటీటీలోనే వస్తున్న వేళ.. సినిమాలపై పెద్దగా ప్రచారం, చర్చ జరగడం లేదు. ఎంత పెద్ద సినిమా వచ్చినా బజ్ ఓ మోస్తరుగానే ఉంటోంది. అప్పుడెప్పుడో సూర్య సినిమాకు మంచి పబ్లిసిటీ జరిగింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ స్థాయి ప్రమోషన్ ధనుష్ సినిమాకొచ్చింది. కానీ ప్రచారంలో కనిపించినంత ఆర్భాటం, హంగు సినిమాలో కనిపించలేదు.

రెండు మాఫియా గ్యాంగ్స్, ఇద్దరి మధ్య గొడవ. హీరో వస్తాడు, ఓ గ్యాంగ్ లో చేరతాడు. ఈ కాన్సెప్ట్ ను చాలా సినిమాల్లో చూశాం. దీనికి లండన్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేశాడు దర్శకుడు. సెటప్ మొత్తం బాగానే సెట్ చేసుకున్నాడు. మంచి టాలెంట్ ఉన్న హీరోను తీసుకున్నాడు. టెక్నీషియన్స్ కూడా బాగానే కుదిరారు. కానీ కథలో సోల్ మిస్సయింది. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్.

దీనికితోడు ఓటీటీలో సినిమాను రెండున్నర గంటల పాటు చూడాలంటే కాస్త ఇబ్బంది అనిపిస్తుంది. ఈ ఇబ్బందికి కారణం కూడా దర్శకుడే. కొన్ని ఎపిసోడ్స్ ను మరీ సాగదీశాడు, మరికొన్ని సన్నివేశాలతో బాగా బోర్ కొట్టించాడు. నిజానికి ఓటీటీకి, సిల్వర్ స్క్రీన్ కు మధ్య తేడా తెలుసుకోవడానికి ఈ సినిమా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇదే సినిమా సిల్వర్ స్క్రీన్ పై ధనుష్ అభిమానులు, ఇతర ఆడియన్స్ మధ్య చూస్తే ఆ కిక్కే వేరు. హీరోయిజం మూమెంట్స్ పీక్స్ లో ఉన్నాయి. కానీ ఇంట్లో కూర్చొని ఈ రెండున్నర గంటల సినిమాను చూడాలంటే కష్టం. ఎందుకంటే ఓటీటీ కంటెంట్ కు ఉండాల్సిన లక్షణాలు దీనికి లేవు. ఓటీటీ కంటెంట్ లో రఫ్ నెస్ ఉండాలి, సహజత్వం కనిపించాలి, కృతకానికి దూరంగా ఉండాలి. ఫ్యామిలీ మేన్ సిరీస్ ఆకట్టుకోవడానికి, ధనుష్ సినిమా నిరాశ పర్చడానికి ఇదే కారణం.

ట్విస్టుల జోలికి వెళ్లకుండా కథను క్లుప్తంగా చూద్దాం.. లండన్ లో పీటర్ (జేమ్స్ కాస్మో) , శివ దాస్ (జోజు జార్జ్) అనే రెండు గ్యాంగుల మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. శివదాస్ ఆలోచనలు తెలుసుకొని అతన్ని దెబ్బతీసే వ్యక్తి కోసం చూస్తున్న పీటర్.. తమిళనాడులో ఉన్న సురులి(ధనుష్) ని కిరాయికి లండన్ కి రప్పిస్తాడు. అలా లండన్ కొచ్చి పీటర్ గ్యాంగ్ లో చేరిన సురులి.. శివదాస్ చేసే పనులపై దృష్టి పెట్టి అతని విషయలు పీటర్ కి తెలియజేస్తూ దెబ్బ తీస్తుంటాడు. పీటర్ ఆఫర్ చేసిన డబ్బు కోసం లండన్ వెళ్ళిన సురులి అక్కడికి వెళ్ళాక ఎలాంటి జీవితం గడిపాడు ? ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లండన్ లో గ్యాంగ్ స్టర్ గా మారిన సురులి చివరికి విలన్ పీటర్ కి ఎదురెళ్ళి అక్కడి శరణార్ధులను ఎలా ఆదుకున్నాడు? అనేది మిగతా కథ.

చెప్పుకోడానికి సింపుల్ గా ఉండే ఈ కథకు మంచి ట్రీట్ మెంట్ ఇచ్చాడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు. కాకపోతే కామెడీగా చెప్పాల్సిన విషయాన్ని సీరియస్ గా, చాలా ఎమోషనల్ గా చూపించాల్సిన సన్నివేశాన్ని కామెడీగా చూపించి ఇబ్బంది పెట్టాడు. ధనుష్ మాత్రం సూపర్. మరోసారి తన టాలెంట్ మొత్తం బయటపెట్టాడు. ఐశ్వర్య లక్ష్మితో పాటు మిగతా నటీనటులంతా బాగా చేశారు.

టెక్నికల్ గా సినిమా ఉన్నతంగా ఉంది. సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, కెమెరామేన్ శ్రేయాష్ క్రిష్ణ పనితనం ప్రతి సీన్ లో కనిపిస్తుంది. ఇద్దరూ బెస్ట్ ఇచ్చారు. దినేష్ సుబ్రమణ్యం ఫైట్స్ ను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బాగా కంపోజ్ చేశాడు. ఇక దర్శకుడి విషయానికొస్తే, కార్తీక్ సుబ్బరాజు కథ-స్క్రీన్ ప్లే అంతగా ఆకట్టుకోవు. స్క్రీన్ ప్లే విషయంలో మరికొన్ని ట్విస్టులు యాడ్ చేసుకుంటే బాగుండేది.

ఓవరాల్ గా జగమే తంత్రం సినిమా ధనుష్ అభిమానుల్ని ఆకట్టుకోవచ్చేమో కానీ, ఓటీటీ ప్రేక్షకుల్ని మాత్రం రంజింపచేయదు.

బాటమ్ లైన్ – ”తంత్రం” ఫలించలేదు

Tags:    
Advertisement

Similar News