కాంగ్రెస్​లో వారసత్వ నేతకు పదవి ఇవ్వొద్దంట?

కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా క్యాడర్​ ఉన్న కాంగ్రెస్​ పార్టీ .. ప్రస్తుతం నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలకు తీవ్ర అసంతృప్తి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజాపోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతున్నది. అన్ని రాష్ట్రాల్లో ఎక్కడిక్కడ గ్రూపు తగాదాలతో సతమతమవుతున్నది. కాంగ్రెస్​ పార్టీని గాడిన పడేసే నేత లేకుండా పోయారు. ఒకవేళ ప్రజలు కాంగ్రెస్​కు అధికారం కట్టబెట్టాలని భావించినా.. ఆ పార్టీ మాత్రం అందుకు సిద్ధంగా […]

Advertisement
Update:2021-06-10 14:30 IST

కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా క్యాడర్​ ఉన్న కాంగ్రెస్​ పార్టీ .. ప్రస్తుతం నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలకు తీవ్ర అసంతృప్తి ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజాపోరాటాలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతున్నది. అన్ని రాష్ట్రాల్లో ఎక్కడిక్కడ గ్రూపు తగాదాలతో సతమతమవుతున్నది.

కాంగ్రెస్​ పార్టీని గాడిన పడేసే నేత లేకుండా పోయారు. ఒకవేళ ప్రజలు కాంగ్రెస్​కు అధికారం కట్టబెట్టాలని భావించినా.. ఆ పార్టీ మాత్రం అందుకు సిద్ధంగా లేనట్టు కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులంతా బీజేపీ కంటే కాంగ్రెస్​ పార్టీ ఎన్నో రెట్లు మేలు అని భావిస్తున్నారు. ఈ పరిస్థితిని కూడా ఆ పార్టీ అనుకూలంగా మలుచుకోలేకపోతున్నది.

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్​ పార్టీపై .. సీనియర్​ నేత వీరప్ప మొయిలీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఏమన్నారంటే.. ‘కాంగ్రెస్​ పార్టీకి ప్రస్తుతం వారసత్వ నేత అవసరం లేదు. గత చరిత్రతో పనిలేదు. సైద్ధాంతికంగా నిబద్ధంగా ఉండే నేత కావాలి’ అంటూ బాంబు పేల్చారు. ఇటీవల ఉత్తర ప్రదేశ్ నేత జితిన్ ప్రసాద కాంగ్రెస్​ను వీడి.. బీజేపీలో చేరిన నేపథ్యంలో మొయిలీ గురువారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

వీరప్ప మొయిలీ ఇంకా ఏమన్నారంటే.. ‘జితిన్​ ప్రసాద గొప్ప నేత ఏమీ కాదు.. ఆయనకు పార్టీ పట్ల పెద్దగా నిబద్ధత కూడా లేదు. ఇటీవల ఆయనకు పశ్చిమబెంగాల్​ ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించారు. కనీసం ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు. దాన్ని బట్టి ఆయన ఎంత అసమర్థుడో అర్థం అవుతున్నది’ అంటూ మండిపడ్డారు వీరప్ప మొయిలీ.

ప్రస్తుతం కాంగ్రెస్​ పరిస్థితి మెరుగుపడాలంటే పార్టీకి శస్త్రచికిత్స అవసరమని ఆయన పేర్కొన్నారు. సీనియారిటీ కారణంగా అసమర్థులకు పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదని సూచించారు. మోదీని ఎదుర్కోవాంటే కాంగ్రెస్​ నేతలంతా కలిసి కట్టుగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్​ సమాయత్తం కావాలని వీరప్ప మొయిలీ సూచించారు.

Tags:    
Advertisement

Similar News