తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ పీసీసీ గోల..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై మళ్లీ కలకలం రేగింది. గతంలోనే ఈ తంతు పూర్తి కావాల్సి ఉన్నా.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో వాయిదా వేసింది అధిష్టానం. అధికారంలోలేని పార్టీ పగ్గాలు చేపట్టడానికి దాదాపుగా ఎవరూ ఉత్సాహం చూపించరు. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం పీసీసీ అధ్యక్ష పదవికి, ముఖ్యమంత్రి సీటు కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకుంటున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ అధినేత కావాలని […]

Advertisement
Update:2021-06-08 01:54 IST

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై మళ్లీ కలకలం రేగింది. గతంలోనే ఈ తంతు పూర్తి కావాల్సి ఉన్నా.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో వాయిదా వేసింది అధిష్టానం. అధికారంలోలేని పార్టీ పగ్గాలు చేపట్టడానికి దాదాపుగా ఎవరూ ఉత్సాహం చూపించరు. కానీ తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం పీసీసీ అధ్యక్ష పదవికి, ముఖ్యమంత్రి సీటు కంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వచ్ఛందంగా తప్పుకోవాలనుకుంటున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ అధినేత కావాలని కోరుకుంటున్నారు. రేవంత్ రెడ్డినుంచి ఆయనకు గట్టి పోటీ ఉంది. మధ్యలో సీనియార్టీ చూపెడుతూ వీహెచ్ కూడా ఓ ట్రైల్ వేస్తున్నారు, జగ్గారెడ్డి లాంటి మరికొందరు నేతలు కూడా పీసీసీ పీఠం అడుగుతున్నారు.

ఇప్పుడెందుకీ హడావిడి..
సాగర్ ఉప ఎన్నిక పూర్తి కావడం, ఈటల బీజేపీ చేరికతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులు మొదలు కావడం, కాంగ్రెస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ వాళ్లు చెప్పుకోవడం.. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కి ఫుల్ టైమ్ అధ్యక్షుడి ఎంపిక అనివార్యంగా మారింది. తెలంగాణలో బీజేపీ బలం పుంజుకోవాలని చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ కి మరమ్మతులు చేయాలనే ఆలోచనలో పడింది అధిష్టానం. మరింత ఆలస్యం చేస్తే.. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకంటే కిందకి పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో.. మరోసారి టీపీసీసీ పీఠం వార్తల్లోకెక్కింది, నేతలు లాబీయింగ్ మొదలు పెట్టారు.

రేవంత్ రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి..
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరకు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బరిలో నిలుస్తారని ప్రచారం జరుగుతోంది. అధిష్టానం రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టు గతంలోనూ వార్తలు వినిపించాయి. ఆయన్ని ఎదుర్కొనేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పావులు కదుపుతున్నారు. “కాంగ్రెస్ కి చావు లేదు.. వచ్చే వాళ్లు వస్తారు.. పోయే వాళ్లు పోతారు, పీసీసీ చీఫ్ పదవి తప్పితే నేను ఏ పదవీ తీసుకోను. పీసీసీ పదవి ముఖ్యమంత్రి పదవి కాదు. పీసీసీ ఇస్తే రాష్ట్రం అంతా తిరుగుతా.. లేదంటే ఉమ్మడి నల్గొండలో మెజారిటీ సీట్లు గెలిపించే బాధ్యత తీసుకుంటా” అని అన్నారు వెంకటరెడ్డి. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మద్దతు కూడా తనకే ఉందని చెబుతున్నారాయన.

ఏఐసీసీ అధ్యక్షుడికే దిక్కులేదు..
కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను ఎవరూ అంచనా వేయలేరు. అందులోనూ ఏఐసీసీ అధ్యక్షుడికే ఇంకా దిక్కులేదు. తాత్కాలిక అధ్యక్షులతో కేంద్ర పార్టీ కాలం నెట్టుకొస్తోంది, ఇక తెలంగాణ గురించి పట్టించుకుంటుందా అనే వాదన కూడా వినపడుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో.. పార్టీకి కొత్త నాయకుడ్ని ప్రకటించి కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందా, లేక ఆ ఉప ఎన్నిక కూడా పూర్తయితే టీపీసీసీ ప్రకటిస్తామని చెబుతుందా.. అనేది తేలాల్సి ఉంది.

Tags:    
Advertisement

Similar News