20 వరకు కర్ఫ్యూ పొడిగింపు.. సీఎం జగన్​ నిర్ణయం..!

కరోనా ఎఫెక్ట్​తో ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటికే కఠిన ఆంక్షలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 10వ తేదీతో ఏపీలో కర్ఫ్యూ ముగియనున్నది. దీంతో కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్​మోహన్​రెడ్డి ఇవాళ అధికారులతో సమావేశమయ్యారు. కరోనా కేసుల తీవ్రత ఎలా ఉంది? కరోనా వ్యాప్తి ఎలా ఉంది? తదితర విషయాలపై ఆయన చర్చించారు. మరోవైపు కర్ఫ్యూ పొడిగింపుపై కూడా చర్చించారు. అధికారులతో చర్చించిన అనంతరం ఏపీలో […]

Advertisement
Update:2021-06-07 08:39 IST

కరోనా ఎఫెక్ట్​తో ఆంధ్రప్రదేశ్​లో ఇప్పటికే కఠిన ఆంక్షలు అమల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నెల 10వ తేదీతో ఏపీలో కర్ఫ్యూ ముగియనున్నది. దీంతో కర్ఫ్యూను పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్​మోహన్​రెడ్డి ఇవాళ అధికారులతో సమావేశమయ్యారు. కరోనా కేసుల తీవ్రత ఎలా ఉంది? కరోనా వ్యాప్తి ఎలా ఉంది? తదితర విషయాలపై ఆయన చర్చించారు. మరోవైపు కర్ఫ్యూ పొడిగింపుపై కూడా చర్చించారు.

అధికారులతో చర్చించిన అనంతరం ఏపీలో కరోనా కేసులు ఇంకా పూర్తిస్థాయిలో అదుపులోకి రానందున ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగించాలని సీఎం జగన్​ మోహన్​రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అయితే కర్ఫ్యూ విషయంలో కొన్ని సడలింపులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సడలింపు ఉంది. ఇకపై ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సడలింపు ఉండనుంది.

మరోవైపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయనున్నాయి. గతంలో మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సడలింపులు ఉండేవి. దీన్ని మరో రెండుగంటల వరకు పొడిగించారు. అంతేకాక ఏపీలో కోవిడ్​ బాధితులకు వైద్యం ఎలా అందుతుంది? తదితర వివరాలపై సీఎం జగన్​ ఆరా తీశారు. ఆరోగ్య శ్రీ అమలు తీరుపై కూడా చర్చించారు.

Tags:    
Advertisement

Similar News