పూజా హెగ్డేకు ఫిదా అయిన ప్రభాస్!
ఇది రాధేశ్యామ్ ముచ్చట. రీసెంట్ గా ప్రభాస్, మరికొంతమంది యూనిట్ సభ్యులు ఈ సినిమా రఫ్ కాపీని చూశారు. సినిమాలో పూజా హెగ్డే పెర్ఫార్మెన్స్, లుక్స్ చూసి ప్రభాస్ ఫిదా అయ్యాడట. మూవీ అంతా చూసిన తర్వాత పూజాను ఓ రేంజ్ లో మెచ్చుకున్నాడట ప్రభాస్. రాధేశ్యామ్ సినిమాలో ప్రేరణ అనే పాత్ర పోషించింది పూజా హెగ్డే. ఈ సినిమాలో ఆమె డాక్టర్ గా కనిపించబోతోంది. ఈ పాత్ర చిత్రీకరణ, పూజా హెగ్డే యాక్టింగ్, హావభావాలు ప్రభాస్ […]
ఇది రాధేశ్యామ్ ముచ్చట. రీసెంట్ గా ప్రభాస్, మరికొంతమంది యూనిట్ సభ్యులు ఈ సినిమా రఫ్ కాపీని
చూశారు. సినిమాలో పూజా హెగ్డే పెర్ఫార్మెన్స్, లుక్స్ చూసి ప్రభాస్ ఫిదా అయ్యాడట. మూవీ అంతా
చూసిన తర్వాత పూజాను ఓ రేంజ్ లో మెచ్చుకున్నాడట ప్రభాస్.
రాధేశ్యామ్ సినిమాలో ప్రేరణ అనే పాత్ర పోషించింది పూజా హెగ్డే. ఈ సినిమాలో ఆమె డాక్టర్ గా
కనిపించబోతోంది. ఈ పాత్ర చిత్రీకరణ, పూజా హెగ్డే యాక్టింగ్, హావభావాలు ప్రభాస్ కు చాలా బాగా
నచ్చాయి. సినిమాకు పూజా హెగ్డే కచ్చితంగా పెద్ద ప్లస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నాడట ప్రభాస్.
ఈ సినిమాకు సంబంధించి తాజాగా హాస్పిటల్ సెట్ వేసిన సంగతి తెలిసిందే. లెక్కప్రకారం ఆ సెట్ లోనే
పూజా హెగ్డేపై కొన్ని సీన్స్ తీయాల్సి ఉంది. కానీ కరోనా కేసులు పెరుగుతుండడంతో.. సెట్స్ కోసం వేసిన
బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర సరంజామా మొత్తాన్ని నిర్మాతలు డొనేట్ చేశారు.
సినిమాకు సంబంధించి దాదాపు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తయింది. కరోనా పరిస్థితులు తగ్గిన
తర్వాత ఓ 10 రోజులు షూట్ చేస్తే టోటల్ మూవీ కంప్లీట్ అయిపోతుంది.