ప్రభాస్ హాలీవుడ్ హంగామా

హీరో ప్రభాస్ పై 2 రోజులుగా ఒకటే పుకార్లు, వరుసగా కథనాలు. ఇంతకీ మేటర్ ఏంటంటే, మన ప్రభాస్ హాలీవుడ్ కు వెళ్లబోతున్నాడట. ఏకంగా మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో నటించబోతున్నాడట. ఇదీ మేటర్. దీన్ని పట్టుకొని ప్రభాస్ అభిమానులు నానా హంగామా చేశారు. ఇంతకీ మేటర్ ఏంటంటే ఇది ఫేక్ న్యూస్. ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ అనేది ఫేక్ న్యూస్ అనే విషయం తాజాగా అందరికీ తెలిసొచ్చింది. ఇంతకీ ఇది ఫేక్ అనే విషయం ఎలా […]

Advertisement
Update:2021-05-27 13:06 IST

హీరో ప్రభాస్ పై 2 రోజులుగా ఒకటే పుకార్లు, వరుసగా కథనాలు. ఇంతకీ మేటర్ ఏంటంటే, మన ప్రభాస్
హాలీవుడ్ కు వెళ్లబోతున్నాడట. ఏకంగా మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ లో నటించబోతున్నాడట. ఇదీ మేటర్.
దీన్ని పట్టుకొని ప్రభాస్ అభిమానులు నానా హంగామా చేశారు. ఇంతకీ మేటర్ ఏంటంటే ఇది ఫేక్ న్యూస్.

ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ అనేది ఫేక్ న్యూస్ అనే విషయం తాజాగా అందరికీ తెలిసొచ్చింది. ఇంతకీ ఇది
ఫేక్ అనే విషయం ఎలా నిర్థారణ అయిందో తెలుసా…? ఏకంగా మిషన్ ఇంపాజిబుల్ 7 ను డైరక్ట్ చేస్తున్న
దర్శకుడే ఈ విషయాన్ని నిర్థారించాడు.

ఆమధ్య ఇటలీలో రాధేశ్యామ్ షూటింగ్ జరిగినప్పుడు ప్రభాస్, సదరు దర్శకుడు చర్చించుకున్నారట.
అలా ఎంఐ-7లోకి ప్రభాస్ వచ్చాడట. దీన్ని ఆ దర్శకుడు క్రిస్టోఫర్ ఖండించాడు. తన సినిమాలో ప్రభాస్
లేడని, అసలు తనను ఇప్పటివరకు కలవలేదని క్లారిటీ ఇచ్చాడు. అదీ సంగతి.

Tags:    
Advertisement

Similar News