కేంద్రం వర్సెస్ వాట్సాప్.. వాదనలు ఎలా ఉన్నాయంటే..

బుధవారం నుంచి కొత్త ఐటీ పాలసీ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అందులోని ఓ రూల్ ను సవాల్ చేస్తూ వాట్సాప్ కోర్టుకెక్కింది. కేంద్ర నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. అయితే దీనిపై కేంద్రం కూడా దీటుగానే స్పందించిది. కేంద్రం ఏమంటుందంటే.. ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీ ప్రకారం ప్రజల ప్రైవేట్ మెసేజీలను ప్రభుత్వం అడిగినప్పుడు వాట్సాప్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రజల ప్రాథమిక హక్కుని కాలరాయడమేనని వాట్సాప్ వాదిస్తోంది. అయితే కేంద్రం […]

Advertisement
Update:2021-05-27 08:12 IST

బుధవారం నుంచి కొత్త ఐటీ పాలసీ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అందులోని ఓ రూల్ ను సవాల్ చేస్తూ వాట్సాప్ కోర్టుకెక్కింది. కేంద్ర నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. అయితే దీనిపై కేంద్రం కూడా దీటుగానే స్పందించిది. కేంద్రం ఏమంటుందంటే..

ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీ ప్రకారం ప్రజల ప్రైవేట్ మెసేజీలను ప్రభుత్వం అడిగినప్పుడు వాట్సాప్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రజల ప్రాథమిక హక్కుని కాలరాయడమేనని వాట్సాప్ వాదిస్తోంది. అయితే కేంద్రం దీనికి స్పందిస్తూ.. ప్రాథమిక హక్కులకు కొన్ని పరిమితులుంటాయని, దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే సందర్భం వచ్చినప్పుడు ప్రభుత్వం ఎవరి సమాచారాన్ని అయినా తెలుసుకోవాల్సి ఉంటుందని, దేశ సార్వభౌమత్వం, శాంతిభద్రతలకు సంబంధించిన తీవ్రమైన అంశాల్లోనే ప్రభుత్వం సమాచారం కోరుతుందని చెప్పింది. కేంద్రం తెచ్చిన కొత్త రూల్ ప్రకారం దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని లేదా ప్రజల భద్రతకు హాని కలిగించేలా తప్పుడు పోస్టులు పెడితే.. వాటి మూలాలను సోషల్‌మీడియా సంస్థలు ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. అయితే దీనికి వాట్సాప్ ససెమిరా అంటోంది.

ప్రజలు ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ కారణంగా తమ భావస్వేచ్ఛను నిర్భయంగా వ్యక్తంజేస్తుంటారు. ఇప్పుడు వారి మెసేజ్ లపై నిఘా వేయడమంటే వారి భావప్రకటనా హక్కుకి భంగం కలిగించినట్టే అని వాట్సాప్ వాదిస్తోంది.

వాట్సాప్ వాదనకు సమాధానంగా.. కేంద్ర ఐటీ శాఖ స్పందిస్తూ..”అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా లాంటి దేశాల్లోని సోషల్ మీడియా సంస్థలన్నీ ప్రభుత్వ చట్టాల ప్రకారం సమాచారాన్ని అందించడానికి కట్టుబడి ఉంటున్నాయి. భారత్ అడుగుతోంది అంతకంటే తక్కువే. అయినా వాట్సాప్ ఇలా వాదనలు చేయడం ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే” అని పేర్కొంది.
“ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనల వల్ల ప్రజల ప్రైవసీకి వచ్చిన ముప్పేమీ లేదు, ప్రజల వ్యక్తిగత ప్రైవసీకి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది. అలాగే దేశ భద్రత, శాంతిభద్రతలను నిర్వహించడం కూడా ప్రభుత్వ బాధ్యతే” అని ప్రభుత్వం చెప్తోంది.

Tags:    
Advertisement

Similar News