నేడే రక్తపున్నమి..

వినీలాకాశంలో వింతలకు కొదవే లేదు. అయితే కొన్ని సార్లు వింతలన్నీ ఒకేరోజు కనువిందు చేస్తుంటాయి. అలాంటి అరుదైన దృగ్విషయమే నేడు ఆవిష్కృతం కాబోతోంది. సూపర్ మూన్, బ్లడ్ మూన్, చంద్రగ్రహణం.. అన్నీ కలిపి నేడు సూపబ్ బ్లడ్ మూన్ గా కనువిందు చేయబోతున్నాయి. భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరిగే చంద్రుడు.. భూమికి చేరువగా పెరిజీ పాయింట్ కి వచ్చినప్పుడు సాధారణ రోజుల్లో కంటే 14శాతం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇలాంటి సమయాల్లో చంద్రుడిని “సూపర్ […]

Advertisement
Update:2021-05-26 02:12 IST

వినీలాకాశంలో వింతలకు కొదవే లేదు. అయితే కొన్ని సార్లు వింతలన్నీ ఒకేరోజు కనువిందు చేస్తుంటాయి. అలాంటి అరుదైన దృగ్విషయమే నేడు ఆవిష్కృతం కాబోతోంది. సూపర్ మూన్, బ్లడ్ మూన్, చంద్రగ్రహణం.. అన్నీ కలిపి నేడు సూపబ్ బ్లడ్ మూన్ గా కనువిందు చేయబోతున్నాయి.

భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరిగే చంద్రుడు.. భూమికి చేరువగా పెరిజీ పాయింట్ కి వచ్చినప్పుడు సాధారణ రోజుల్లో కంటే 14శాతం పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇలాంటి సమయాల్లో చంద్రుడిని “సూపర్ మూన్”గా పిలుస్తారు. అప్పుడు పౌర్ణమి ఘడియలు వస్తే.. ఆ దృశ్యం మరింత సుందరంగా ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున దాదాపు 7.23 నిముషాలపాటు చంద్రుడు పెరిజీ స్థానంలో భూమికి చేరువగా ఉంటాడు. సాధారణంగా చంద్రుడి ఆకర్షణ శక్తి వల్ల పౌర్ణమి, అమావాస్య సమయాల్లో సముద్రపు అలలు అసాధారణంగా ఉంటాయి. ఇలాంటి సూపర్ మూన్ వచ్చే సమయంలో అయితే అలల ఎత్తు కనిష్టంగా మరో ఐదు సెంటీమీటర్ల మేర పెరుగుతుంది. సూపర్ మూన్‌ తో భూకంపాలు, సునామీలు, వరదలు వంటి ఉపద్రవాలు వస్తాయని కొందరు భావిస్తారు కానీ వాటికి ఎలాంటి ఆధారాలు లేవు.

సూపర్ మూన్ తోపాటు బ్లడ్ మూన్ కూడా..
ఒక్కోసారి సంపూర్ణ చంద్రగ్రహణ సమయంలో సూర్యకాంతి నేరుగా భూమిపై పడి, భూవాతావరణం గుండా పరావర్తనం చెంది చంద్రుడిపై పడుతుంది. అప్పుడు చంద్రుడు ఎర్రగా కనబడతాడు. దీన్నే బ్లడ్ మూన్‌గా పిలుస్తారు. ఈ దఫా సూపర్ మూన్, బ్లడ్ మూన్ రెండూ ఒకేరోజు రావడం విశేషం. సాధారణంగా ప్రతి ఆరేళ్లకోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతం అవుతుంది. కానీ 2019లో సూపర్ బ్లడ్ మూన్ కనువిందు చేశాక కేవలం రెండేళ్ల వ్యవధిలోనే మరో సూపర్ బ్లడ్ మూన్ రావడం విశేషం.

సంపూర్ణ చంద్రగ్రహణం ఉత్తర అమెరికా, పశ్చిమ దక్షిణ అమెరికా, తూర్పు ఆసియాల్లో మత్రమే కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.15 నిమిషాలకు సూపర్ బ్లడ్ మూన్ మొదలై.. సాయంత్రం 6.22 వరకు ఉంటుంది. అయితే మన దేశం నుంచి పాక్షిక చంద్రగ్రహణాన్ని మాత్రమే వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహణం చివరి ఘట్టాలను భారత్‌ లోని తూర్పు ప్రాంతాల్లో ఉండేవారు చూడొచ్చు. మధ్యాహ్నం 3.15 గంటల నుంచి 4.58 గంటల మధ్య ఈశాన్య రాష్ర్టాలు, పశ్చిమబెంగాల్‌, ఒడిశా తీరప్రాంతాలు, అండమాన్‌-నికోబార్‌ దీవుల వాసులు పాక్షిక చంద్రగ్రహణ దృశ్యాల్ని చూడొచ్చు.

Tags:    
Advertisement

Similar News