ఢిల్లీలో మరోసారి లాక్​డౌన్​ పొడిగింపు..!

కరోనా సెకండ్ వేవ్ ఆరంభ సమయంలో వేలకొద్ది నమోదవుతున్న పాజిటివ్ కేసులతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి అయ్యింది. రోజుకు అక్కడ 25 నుంచి 30 వేల వరకూ పాజిటివ్ కేసులు నమోదయ్యేవి. ఆక్సిజన్ కొరతతో పెద్ద సంఖ్యలో బాధితులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత కోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ సిలిండర్లను అందజేయడంతో పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చింది. అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ కఠిన లాక్​డౌన్​ అమలు […]

Advertisement
Update:2021-05-23 14:44 IST

కరోనా సెకండ్ వేవ్ ఆరంభ సమయంలో వేలకొద్ది నమోదవుతున్న పాజిటివ్ కేసులతో ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి అయ్యింది. రోజుకు అక్కడ 25 నుంచి 30 వేల వరకూ పాజిటివ్ కేసులు నమోదయ్యేవి.

ఆక్సిజన్ కొరతతో పెద్ద సంఖ్యలో బాధితులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ తర్వాత కోర్టు జోక్యంతో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి సరిపడా ఆక్సిజన్ సిలిండర్లను అందజేయడంతో పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చింది. అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ కఠిన లాక్​డౌన్​ అమలు చేస్తూ వచ్చారు. దీంతో అక్కడ కేసుల సంఖ్య క్రమేణా తగ్గుముఖం పడుతూ వచ్చాయి.కాగా ఇప్పటికే ఢిల్లీలో లాక్​డౌన్​ కొనసాగుతుండగా.. మే 31 వరకు లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్టు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.

ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రజలకు ఓ గుడ్​న్యూస్​ కూడా చెప్పారు. కేసుల సంఖ్య తగ్గితే మే 31 తర్వాత అన్​లాక్​ విధించనున్నట్టు ఆయన చెప్పారు. ఢిల్లీలో లాక్​డౌన్​ పొడిగించడం ఇది ఆరోసారి. లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తూ రావడం వల్లే ఢిల్లీలో కరోనా వ్యాప్తి తగ్గుతూ వచ్చింది.

ప్రతిరోజు ఢిల్లీలో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యేవి. ఓ దశలో 30 వేల వరకూ కూడా కేసులు వచ్చాయి. అయితే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ ఎంతో సమర్థవంతంగా పనిచేసి కరోనాను కట్టడిచేయగలిగారు.

ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిపోయింది. గతంలో 35 శాతం ఉన్న పాజిటివిటీ కేసులు .. ప్రస్తుతం 2.5 శాతానికి తగ్గాయి. శనివారం అక్కడ కేవలం 1600 కేసులు నమోదు అయ్యాయంటే పరిస్థితి ఎంత కంట్రోల్ లోకి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. లాక్​డౌన్​ ఆ రాష్ట్రంలో సత్ఫలితాలు ఇచ్చింది.

ఈ విషయంపై సీఎం కేజ్రీవాల్​ మాట్లాడుతూ.. ఢిల్లీలో కేసుల సంఖ్య మరింత తగ్గించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ నెల 31 వరకు కేసుల సంఖ్య సున్నాకు తీసుకొస్తామని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత క్రమంగా ఆంక్షలు ఎత్తేస్తామని తెలిపారు. ఇక ఢిల్లీలో థర్డ్​వేవ్​ వచ్చే అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలందరికీ వ్యాక్సిన్​ ఇచ్చే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

ఇందుకోసం అవసరమైతే ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్​ ఇస్తామని చెప్పారు. ఒకవేళ మే 31 తర్వాత కూడా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గకపోతే మాత్రం మరోసారి లాక్​డౌన్​ పొడిగిస్తామని కేజ్రీవాల్​ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News