రాధేశ్యామ్ లో ఆ పాట ఉంది

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మొన్నటివరకు ఓ పాట తగ్గించి చెప్పారు. మిగిలిన ఆ ఒక్క పాటను సినిమా నుంచి కట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే అలా కట్ చేసిన సాంగ్ ను ఇప్పుడు మళ్లీ జోడించారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది రాధేశ్యామ్ సినిమా చాలా లేట్ అయింది. చివరికి 10 రోజుల షెడ్యూల్ కు కూడా అడ్డంకులు తప్పలేదు. దీంతో రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ ను అలాగే వదిలేశారు. ఒక […]

Advertisement
Update:2021-05-22 13:27 IST

ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి మొన్నటివరకు ఓ పాట తగ్గించి చెప్పారు. మిగిలిన ఆ ఒక్క పాటను
సినిమా నుంచి కట్ చేయడానికి ప్రయత్నించారు. అయితే అలా కట్ చేసిన సాంగ్ ను ఇప్పుడు మళ్లీ
జోడించారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.

ఇంతకీ ఏం జరిగింది
రాధేశ్యామ్ సినిమా చాలా లేట్ అయింది. చివరికి 10 రోజుల షెడ్యూల్ కు కూడా అడ్డంకులు తప్పలేదు.
దీంతో రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్ ను అలాగే వదిలేశారు. ఒక పాట, కొంత ప్యాచ్ వర్క్ మాత్రం
పెండింగ్ లో ఉంది. మరోసారి షెడ్యూల్ స్టార్ట్ చేస్తే మాత్రం ఆ పాటను వదిలేసి ప్యాచ్ వర్క్ పూర్తిచేసి
సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని నిర్మాతలు భావించారు.

కానీ టీ-సిరీస్ అధినేతలు, నార్త్ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఒప్పుకోలేదు. కట్ చేసిన ఆ పాటను షూట్ చేసి
పెట్టాల్సిందేనని మొండికేశారు. దీంతో చేసేదేం లేక ఆ మిగిలిన ఒక్క పాటను కూడా పూర్తిచేయాలని
మేకర్స్ నిర్ణయించుకున్నారు. వచ్చే నెలలో ఈ షెడ్యూల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News