భారత్ లో థర్డ్ వేవ్.. ఎప్పుడు? ఎలా..?

కరోనా సెకండ్ వేవ్ ఉంటుందంటే.. గతంలో ఎవరూ నమ్మలేదు కానీ.. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందంటే మాత్రం, ఎప్పుడు, ఎలా అని ఆరా తీస్తున్నారు. సెకండ్ వేవ్ దెబ్బతో దాదాపుగా థర్డ్ వేవ్ వస్తుందని అందరూ మానసికంగా సిద్ధమైపోయారు. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం ఓ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం భారత్ లో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ కి జులైలో అడ్డుకట్ట పడే అవకాశం ఉందని చెబుతున్న ఆ […]

Advertisement
Update:2021-05-20 02:26 IST

కరోనా సెకండ్ వేవ్ ఉంటుందంటే.. గతంలో ఎవరూ నమ్మలేదు కానీ.. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుందంటే మాత్రం, ఎప్పుడు, ఎలా అని ఆరా తీస్తున్నారు. సెకండ్ వేవ్ దెబ్బతో దాదాపుగా థర్డ్ వేవ్ వస్తుందని అందరూ మానసికంగా సిద్ధమైపోయారు. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందం ఓ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం భారత్ లో విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ కి జులైలో అడ్డుకట్ట పడే అవకాశం ఉందని చెబుతున్న ఆ బృందం.. మరో 6 నుంచి 8 నెలల తర్వాతే మూడో దశ మొదలవుతుందని అంచనా వేసింది.

సెకండ్ వేవ్ కి ముగింపు ఎప్పుడు..?
కరోనా ఫస్ట్ వేవ్ ప్రభావం భారత్ లో పెద్దగా లేకపోయినా.. సెకండ్ వేవ్ కేవలం భారత్ నే టార్గెట్ చేసినట్టు అర్థమవుతోంది. మిగతా దేశాల్లో వ్యాక్సినేషన్ ఓ కొలిక్కి రావడం, వైద్య సౌకర్యాలు మెరుగు పరచుకోవడం, ప్రజలు, ప్రజా ప్రతినిధుల్లో అవగాహన పెరగడంతో కేసుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. కరోనాని జయించేశామన్న అత్యుత్సాహం, వ్యాక్సినేషన్ పై నిర్లక్ష్యం, మాస్క్ లు, సామాజిక దూరానికి మంగళం పాడటం, ఆక్సిజన్ కొరత, వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో భారత్ ని సెకండ్ వేవ్ వణికిస్తోంది. లాక్ డౌన్ పెట్టేందుకు కేంద్రం మీనమేషాలు లెక్కించడం, ఎన్నికలు, కుంభమేళా వంటి కార్యక్రమాలతో పరోక్షంగా వైరస్ ని పెంచి పోషించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

కేంద్రం అధికారిక లెక్కల ప్రకారం భారత్ లో రోజువారీ కేసులు తగ్గుతున్నాయి. 4లక్షల కేసుల నుంచి 3 లక్షల్లోకి వచ్చేశాం. ఇదే రీతిలో జూన్ మొదటి వారంలో రోజువారీ కేసుల సంఖ్య లక్షన్నరకు చేరుకుంటుందని, జూన్ ఆఖరుకి కేవలం 20వేల కేసులు మాత్రమే నమోదవుతాయని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. ఈనెల 15నుంచి 31 వరకు వైరస్ ఉధృతి అత్యంత ఎక్కువగా ఉంటుందని, మే నెలాఖరునుంచి తగ్గుదల మొదలవుతుందని చెబుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గోవాల్లో ఇప్పటికే కరోనా పీక్ స్టేజ్ కి వెళ్లిందని, తమిళనాడు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు నెలాఖరుకి తీవ్ర స్థాయికి చేరుకుంటాయని అంటున్నారు.

మూడో దశలో ముప్పు తగ్గేనా..?
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని అంచనా వేయడంలో విఫలం అయినట్టు ఒప్పుకుంటున్న శాస్త్రవేత్తల బృందం, మూడో దశపై మాత్రం ముందస్తు సమాచారం ఇస్తోంది. 6 నుంచి 8నెలల తర్వాతే భారత్ లో కరోనా మూడో దశ వస్తుందని, అయితే అప్పటికి వ్యాక్సినేషన్ జోరందుకోవడంతో దాని ప్రభావం ఎక్కువమందిపై ఉండదని చెబుతున్నారు. పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనే వార్తలపై మాత్రం ఈ బృందం స్పందించలేదు.

Tags:    
Advertisement

Similar News