2డీజీ ఔషధం విడుదల

కరోనా చికిత్సలో ఉపయోగించే 2-డియాక్సీ డి-గ్లూకోజ్ (2డీజీ) ఇవాళ విడుదల అయ్యింది. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, హర్షవర్ధన్ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 2డీజీ ఔషధాన్ని విడుదల చేశారు. పలు ఆసుపత్రులకు మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేశారు. హైదరాబాద్ చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లయిడ్ సైన్సెస్(ఇన్మాస్ ) తో కలసి డీఆర్డీవో ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. కరోనా చికిత్సలో అత్యవసర వినియోగానికి డీజీసీఐ అనుమతులు […]

Advertisement
Update:2021-05-17 06:16 IST

కరోనా చికిత్సలో ఉపయోగించే 2-డియాక్సీ డి-గ్లూకోజ్ (2డీజీ) ఇవాళ విడుదల అయ్యింది. కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, హర్షవర్ధన్ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 2డీజీ ఔషధాన్ని విడుదల చేశారు.
పలు ఆసుపత్రులకు మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేశారు.

హైదరాబాద్ చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లయిడ్ సైన్సెస్(ఇన్మాస్ ) తో కలసి డీఆర్డీవో ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. కరోనా చికిత్సలో అత్యవసర వినియోగానికి డీజీసీఐ అనుమతులు ఇవ్వడంతో ఇవాళ 2డీజీ ఔషధాన్ని విడుదల చేశారు.

ఈ ఔషధం పొడి రూపంలో ఉంటుంది. దీనిని నీటితో కలిపి తీసుకోవాలని వైద్య నిపుణులు తెలిపారు. పౌడర్ రూపంలో ఉండే సాచెట్ నేటి నుండి అందుబాటులో ఉంటుందని డీఆర్డీవో అధికారులు తెలిపారు. 2డీజీ ఔషధాన్ని నీటిలో కరిగించి నోటి ద్వారా తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా వైరస్ ఉన్న కణాల్లోకి చేరి దాని అభివృద్ధిని అడ్డుకుంటుందని డీఆర్డీవో అధికారులు వెల్లడించారు.

ఓ మోస్తారు నుంచి తీవ్రమైన లక్షణాలు ఉన్న వారిలో ఇది సమర్ధవంతంగా పని చేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది. ఔషధాన్ని వాడిన కరోనా రోగులు వేగంగా కోలుకుంటున్నట్లు క్లినికల్ ట్రయల్స్ ద్వారా తెలిసింది. 2డీజీ ఔషధాన్ని తీసుకున్న రోగులు ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ ఔషధంతో చికిత్స పొందిన కరోనా రోగుల్లో చాలా మందికి స్వల్ప కాలంలోనే ఆర్టీ పీసీఆర్ టెస్ట్ లో నెగటివ్ వస్తోందని డీఆర్ డీవో అధికారులు తెలిపారు.

వైరస్ పెరుగుదలను ఈ ఔషధం కట్టడి చేస్తోందని, దీనిని తీసుకున్న తర్వాత కరోనా రోగులు త్వరగా కోలుకుంటున్నట్లు వారు చెప్పారు. మెడికల్ ఆక్సిజన్ పై కూడా ఆధారపడాల్సిన అవసరం రావడంలేదని డీఆర్డీవో అధికార వర్గాలు తెలిపాయి.

Tags:    
Advertisement

Similar News